సూర్యుడు భగభగ మండిపోతుంటాడు. ఆ సూర్యుడి నుంచి వెలువడే మంటలను కరోనా అంటారు. అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో సూర్యుడి చుట్టూ వలయం ఆకారంలో కనిపించే కాంతిని కూడా కరోనా అని పిలుస్తారట.
![speacial story on corona-has-different-meanings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7902720_116_7902720_1593948220820.png)
విద్యుత్‌ను ప్రసరింపజేసే కండక్టర్ చుట్టూ ఉండే విద్యుత్‌శక్తిని కూడా కరోనా అని అంటారు
![speacial story on corona-has-different-meanings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7902720_106_7902720_1593948073119.png)
మన శరీరంలో కొన్ని భాగాలకు పైభాగంలో కిరీటంలాంటి ఆకారం ఉంటుంది. అలాంటి భాగాన్ని కూడా కరోనా ఉంటారు. ఉదాహరణకు పంటి కొనభాగం, పుర్రెపై భాగం
![speacial story on corona-has-different-meanings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7902720_853_7902720_1593948422935.png)
కొన్ని రకాల పూల మొక్కల్లో పూల మధ్యలో కప్పు ఆకృతి ఉంటుంది. ఆ ఆకృతిని కరోనా అని పిలుస్తారు.
![speacial story on corona-has-different-meanings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7902720_53_7902720_1593948115348.png)
గదిలో గోడ మూలల్లో అలంకరణ కోసం ఏర్పాటుచేసే సీలింగ్ డిజైన్‌ను కూడా కరోనా అనే అంటారట.
![speacial story on corona-has-different-meanings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7902720_791_7902720_1593948038154.png)
చర్చిల్లో అమర్చే షాండిలియర్‌నూ కరోనా అనే పిలుస్తారు.
క్యూబా రాజధాని హవానా కేంద్రంగా ‘లా కరోనా’ పేరుతో సిగార్‌లు తయారు అవుతాయి. ‘లా కరోనా’ పేరుకు ట్రేడ్‌మార్క్ ఉంది. దీంతో కరోనా అంటే.. ఇది కూడా జాబితాలోకి వచ్చేస్తుంది. మెక్సికోలో ‘కరోనా ఎక్స్‌ట్రా’ పేరుతో బీర్లు ఉత్పత్తి అవుతాయి. తాజాగా కరోనా నేపథ్యంలో వాటి ఉత్పత్తిని నిలిపివేశారు.
![speacial story on corona-has-different-meanings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7902720_267_7902720_1593948175582.png)
ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం