ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమా రెడ్డి గ్రేటర్ హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. సరూర్‌నగర్, ఆస్మాన్‌గఢ్, చార్మినార్ డివిజన్లలో పర్యటించారు. సీఎండీ సింగరేణి కాలనీ, గౌతంనగర్, శారదనగర్, కమలానగర్, కోదండరామ్‌నగర్, పీఅండ్‌టీ కాలనీ, బార్కాస్, మైసారం, చాంద్రాయణగుట్ట, అల్జుబైల్ కాలనీ, ఫలక్‌నుమా, ఇంద్రానగర్, జమాల్‌నగర్, సలాలా ప్రాంతాల్లో దాదాపు రెండు నుంచి మూడు అడుగుల నీళ్లు ఉన్నాయని చెప్పారు.
సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో అపార్ట్మెంట్లు, సెల్లార్లు, కొన్ని వీధుల్లో వరద నీరు ఉండటం వల్ల 13 ట్రాన్స్ఫార్మర్లు ఛార్జ్ చేయలేదన్నారు. చార్మినార్ డివిజన్ పరిధిలోని కాలనీల్లో వరద నీరు కారణంగా 28 ట్రాన్స్ఫార్మర్లలో సరఫరా పునరుద్ధరించలేదని వివరించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ సెల్లార్లు, వీధులు వరద ముంపులో ఉండటం వల్ల 222 ట్రాన్స్ఫార్మర్లలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని తెలిపారు.
క్షేత్ర స్థాయి అధికారులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా విద్యుత్ అధికారులు, సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు శ్రమించారన్నారు.
ఇదీ చదవండి: ఎల్లూరు సర్జ్‌పూల్ పంప్‌హౌస్‌లోకి చేరిన నీరు, మునిగిన మోటార్లు