కొవిడ్ -19 విపత్కర పరిస్థితుల్లో కూడా దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది. రైల్వే ఆసుపత్రుల్లో ఒకటైన సికింద్రాబాద్ లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆస్పత్రిలో రైల్వే ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి, వారి కుటుంబ సభ్యుల్లో కొవిడ్ -19తో స్వల్ప లక్షణాలతో బాధపడేవారికి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారికి నైతిక మద్దతునిస్తూ ముందుకు వచ్చి ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు వివిధ రకాల రక్షణ సామగ్రిని అందజేయాలని దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం సంకల్పించింది.
దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య ఆధ్వర్యంలో 350 ఫేస్ షీల్డులు, శానిటైజర్ సీసాలు, కాళ్లతో నిర్వహించే శానిటైజర్ స్టాండులను ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న కుమార్కు అందజేశారు. ఈ సమావేశంలో ద.మ. రైల్వే జీఎం గజానన్ మాల్యా పాల్గొన్నారు. వీటిని లాలాగూడ రైల్వే ఆస్పత్రిలో కొవిడ్ -19 వ్యాధి సోకిన వారికి సేవలందించడంలో ముందుండే పారిశుద్ధ్య సిబ్బందికి వితరణ చేయనున్నారు.
ఇవీ చూడండి: కరోనా వలయంలో హైదరాబాద్.. భయాందోళనలో ప్రజలు