South Central Railway Ticket Checks Revenue Rs.9.62 Crores One Day: టిక్కెట్ తనిఖీల్లో దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 9.62 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇంత మొత్తంలో ఒక్కరోజే ఆదాయం రావడం దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మొదటిసారని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
అయితే రైళ్లలో టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. టికెట్ తీసుకొని వారివల్ల.. అధికారిక టికెట్‌తో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారనే అనేక ఫిర్యాదులు రైల్వేకు అందడంతో ఈ విషయంపై చర్యలు తీసుకున్నారు. అనధికారిక ప్రయాణికులను తగ్గించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నిరంతరం విస్తృతంగా టికెట్ తనిఖీలను నిర్వహిస్తోంది.
Record Revenue For South Central Railway: రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించడం, అనధికారిక ప్రయాణం, పరిమితికి మించిన లగేజీని బుక్ చేయకుండా ప్రయాణించే ప్రయాణికుల నుంచి దక్షిణ మధ్య రైల్వేకు చెందిన తొమ్మిది మంది టిక్కెట్ తనిఖీ సిబ్బంది రికార్డు స్థాయిలో జరిమాన విధించారు. ఒక్కొక్క టికెట్ తనిఖీ అధికారి రూ.కోటి కోటికి పైగా జరిమాన వసూలు చేశారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తొమ్మిది మంది టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 1.16 లక్షల అనధికారిక ప్రయాణికుల నుండి ఏకంగా రూ. 9.62 కోట్లు వసూలు చేశారని పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా ఒక్కో టికెట్ తనిఖీ సిబ్బంది, టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి జరిమానా రూపంలో రూ.కోటి ఆదాయం రాబట్టడం దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇదే తొలిసారి అని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. టికెట్ తనిఖీలలో సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారన్నారు. సీనియర్ డి.సి.ఎం సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ టి.నటరాజన్.. టిక్కెట్ లేకుండా ప్రయాణించిన 12,689 మంది ప్రయాణికులు, పరిమితికి మించిన లగేజిని అధికారికంగా బుక్ చేయకుండా తీసుకెళ్లిన వారి వద్ద నుంచి అత్యధికంగా రూ1.16 కోట్లు జరిమానాలు వసూలు చేశారని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. విధి నిర్వహణలో అంకితభావంతో ఆదర్శవంతమైన పని తీరును కనబర్చిన టికెట్ తనిఖీ సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు.
ఇవీ చదవండి: