ETV Bharat / state

ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ ట్వీట్‌.. సుమోటోగా కేసు నమోదు చేయాలన్న భాజపా నేత - ఆర్జీవీ లేేటేస్ట్ ట్వీట్

Somu Veerraju on RGV: భాజపా రాష్ట్రపతి అభ్యర్థిపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్​పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వర్మ అడుగుజాడల్లో ఎవరూ వెళ్లకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలన్నారు. అలాగే ఓ మానసిక వైద్యునికి వర్మను చూపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ ట్వీట్‌
ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ ట్వీట్‌
author img

By

Published : Jun 24, 2022, 5:31 PM IST

Counter to RGV: ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతున్న సందర్భంలో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్వీట్‌పై పోలీసు శాఖ వెంటనే చర్యలు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరును వ్యంగ్యంగా వాడటం అంటే.. రాంగోపాల్‌వర్మ తన పరిధికి మించి వ్యవహరించారని విమర్శించారు.

వర్మ అడుగుజాడల్లో ఎవరూ వెళ్లకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలని... అదే విధంగా పేరొందిన మానసిక వైద్యునికి వర్మను చూపించాల్సిన అవసరం ఉందని వీర్రాజు పేర్కొన్నారు. వాక్ స్వాతంత్య్ర హద్దును దాటి ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్‌ చేశారు.

  • ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతున్న సందర్బంగా రాష్ట్రపతి అభ్యర్థి నామవాచకాన్ని సెటైరికల్ గా ఉపయోగించడం తగదు. వాక్ స్వాతంత్ర్యపు హక్కు పరిధిదాటి ప్రవర్తించిన @RGVzoomin పై పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలి.@blsanthosh @JPNadda#DraupadiMurmu https://t.co/k7IhNlb2UM

    — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) June 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.