ETV Bharat / state

విమెన్స్​ డే స్పెషల్: హైటెక్ వ్యవసాయం చేస్తున్న యువతి - Hydroponic agri culture news

హైడ్రోపోనిక్... అభివృద్ధి చెందిన దేశాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న పంట సాగు విధానంలో ఓ ప్రవాస భారతీయ యువతి కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. యూకేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఉద్యోగం, ఆకర్షణీయమైన వేతనం వదిలేసి తన సోదరుడుతో కలిసి ఏకంగా సేద్యంబాట పట్టారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా నేర్పిన పాఠం... మేల్కొలుపు మళ్లీ మూలాల్లోకి వెళ్లడం అనివార్యం అని భావించి హైటెక్ వ్యవసాయంలోకి దిగారు. హైదరాబాద్ శివారులో హైడ్రోపోనిక్ విధానంలో రసాయన అవశేషాల్లేని ఆరోగ్యకర ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వ్యవసాయంపై ఏ మాత్రం అవగాహన లేకపోయినా కూడా సమగ్ర అధ్యయనం చేసి "హైలీ ఫ్రెష్ ఫాం" పేరిట అంకుర కేంద్రానికి శ్రీకారం చుట్టారు. ఆ చెల్లీఅన్నా కలిసి ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారుల ఇంటి ముంగిటకే స్వచ్ఛమైన కూరలు చేరవేస్తుండటం విశేషం.

జాబ్ వదిలి... హైటెక్ వ్యవసాయం చేపట్టిన సాఫ్ట్​వేర్

author img

By

Published : Mar 8, 2021, 5:02 PM IST

కొవిడ్-19 ఎన్నో జీవితాలు, కుటుంబాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఏకంగా జీవన శైలి, ఆరోగ్యం, ఆహారపు అభిరుచులు నేర్పింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా... ప్రత్యేకించి భారతీయ సమాజంలో ఉన్నత విద్యాభ్యాసం... ఎన్ని ఉద్యోగాలు చేసి ఎంత డబ్బు సంపాదించినా... ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా తినాల్సింది ఆహారమే. ఇప్పటి దాకా రసాయన, క్రిమిసంహారక అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యాలు చిధ్రం చేసుకుంటున్న తరుణంలో... రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే రసాయన అవశేషాలు, కల్తీ లేని ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని ఓ ప్రవాస భారతీయురాలు భావించారు.

హైడ్రోపొనిక్ విధానం...

యూకేలో ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న దారపురెడ్డి తేజ స్రవంతి... కొవిడ్‌ సమయంలో తిరిగి భారత్‌ విచ్చేసింది. అప్పటికే యూకేలో పలు ప్రాంతాల్లో హైడ్రోపోనిక్ టెక్నాలజీ సాయంతో ఆకుకూరలు, కాయగూరల సాగు, విధానం, మార్కెటింగ్‌పై అధ్యయనం చేసిన ఆమె... హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే తన సోదరుడు తేజకార్తీక్‌తో కలిసి హైటెక్ వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. నిజాంపేటకు చెందిన వీరిద్దరూ ఇద్దరూ ఉద్యోగాలు వదిలేసి నగర శివారు దుండిగల్ సమీపంలోని అన్నారం వద్ద 2 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నారు. రెండు షెడ్లలో హైడ్రోపోనిక్ విధానంలో కూరగాయలు పండిస్తున్నారు. మరో ఎకరంలో కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. మక్కువతోనే ఆధునిక పద్ధతుల్లో సేద్యంలో సఫలం అయ్యామని... దేశీయ ఆకుకూరలు పండిస్తున్నామని యువ రైతు తేజ స్రవంతి సంతోషం వ్యక్తం చేశారు.

అనుభవం లేకున్నా...

ఏ మాత్రం అనుభవం లేదు. కొత్త టెక్నాలజీ, శాస్త్రీయపరమైన సాగు విధానం కావడంతో మొదట్లో బంధువులు, స్నేహితులు ఎవరూ వెన్నుతట్టి ప్రోత్సహించలేదు. అయినా వ్యవసాయంపై ప్రేమే ఇద్దరినీ అడుగులు ముందుకు వేసేలా చేసింది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా సహజ సిద్ధంగా పండించిన ఆకుకూరలు సరఫరా చేయాలన్న లక్ష్యంతో డిసెంబరులో సొంత నిధులు, సన్నిహితుల ద్వారా సమకూర్చిన రూ. 70 లక్షలు వెచ్చించి ఈ ప్రాజెక్టు నెలకొల్పారు.

నీరు, నేల, ఏ ఇతర కల్తీ లేకుండా సురక్షిత పద్ధతుల్లో పాలకూర, తోటకూర, ఎర్రతోటకూర, కొత్తమీర, పుదీనా వంటి దేశీయ ఆకుకూరలు, గ్రీన్‌ ఇండివ్, లెట్ట్యూస్ ఐస్‌బెర్గ్, గ్రీన్ సెలెరీ, క్యాబేజీ వంటి విదేశీ ఉత్పత్తులు పండిస్తున్నారు. ఆరుబయట క్షేత్రంలో బ్రకోలీ, రెడ్ క్యాలీఫ్లవర్ పండిస్తున్నారు. బోర్ నీటిని ఆర్‌ఓ ప్లాంట్‌లో శుద్ధి చేసి సూక్ష్మ సేద్యం కింద రీసైక్లింగ్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. ఈ విధానంలో 80 నుంచి 85 శాతం ఆదా అవడం ఓ ప్రత్యేకత. ఆ ఉత్పత్తులన్నీ నవంబరు 5 నుంచి చేతికొస్తున్నాయి.

ప్రతిదీ ఓ అనుభవంగా స్వీకరించి సమీక్షించుకుంటూ వ్యాపార ధోరణిలో ఆ నాటి నుంచి ఈ నాటికి ప్రచార సరళిలో ముందుకు వెళుతున్నారు. తెగుళ్లు, చీడపీడలు ఓ పెద్ద సవాల్‌ కావడంతో విత్తనం, మొలక, మొక్క... అన్ని దశల్లో ఆ సమస్యలే ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తేజస్రవంతి సోదరుడు తేజకార్తీక్ అన్నారు.

నేలవిడిచి సాగు...

ఉన్నత విద్యావంతులు, ఐటీ నిపుణులై ఉండి హైటెక్‌ వ్యవసాయం... నేల విడిచి సాగు చేస్తున్నారు. ఖరీదైన వ్యాపకంగా చెప్పుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోపొనిక్ విధానంలో సాగైన ఉత్పత్తులు "హైలీ ఫ్రెష్ ఫాం" బ్రాండ్‌పై మార్కెటింగ్ చేస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికగా ఇంటి ముంగిటకే చేరవేస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా మధ్య దళారులు లేకుండా కల్తీలకు ఆస్కారం లేని తాజా కూరగాయలు, ఆకుకూరలు మధ్య తరగతి కుటుంబాలు చేరవేయడంలో కలిగే సంతృప్తి వేరు. హైలీ ఫ్రెష్ ఫాం స్టాటప్ వయస్సు కేవలం మూడు నాలుగు మాసాలే.

ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్ ప్రకారం వారానికి సరిపడ ఎంపిక చేసుకున్న మూడు లేదా నాలుగు ఆకుకూరలు ప్యాకేజీ ఆధారంగా రూ. 125కే పేపర్ బ్యాగుల్లో ఇళ్లకు 2 గంటల వ్యవధిలో చేర్చుతున్నారు. ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాలపై కేంద్రీకరించి పనిచేస్తూ 250 కుటుంబాలకు అందిస్తున్నారు. డిసెంబర్‌లోగా 1000 కుటుంబాలకు చేరేందుకు కృషి చేస్తున్నారు. ధనవంతులంటే ఖరీదైన ఆహారం తీసుకునే స్థోమత ఉంటుంది... ఎలాగూ కార్పొరేట్ వైద్యం చేయించుకునే శక్తి ఉంటుంది. అదే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పోషకాహర లోపం, రోగ నిరోధక శక్తి పెంచే ఆరోగ్యకర ఉత్పత్తులు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదే భవిష్యత్...

మరో పదేళ్ల తర్వాత ఇదే భవిష్యత్తు. ఇటీవల ప్రాణాంతక క్యాన్సర్‌... మధుమేహం, రక్తపోటు, ఊభకాయం జీవనశైలి వ్యాధులు స్వయంగా చూస్తున్నాం. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే విధిగా హైడ్రోపోనిక్ విధానం లేదా సేంద్రీయ, ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు తినాల్సిందే. పూర్తి స్వచ్ఛమైన, రసాయన అవశేషాల్లేని ఉత్పత్తుల సాగు... ఆ సోదరీసోదరులకు ప్రేరణ ఇచ్చిన దృష్ట్యా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి జీవన విధాన సరళిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఈ నీళ్లు తాగితే కరోనా‌ దరిచేరదట...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.