ETV Bharat / state

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు - తెలంగాణ తాజా వార్తలు

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్ధులు అద్బుత ప్రతిభ కనబరిచారు. నీట్‌, ఐఐటీలో సీట్లు పొందడంతో పాటు పైలెట్ కోర్సులకు ఎంపికై ఆదర్శంగా నిలుస్తున్నారు. నీట్‌ పరీక్షలో 128 మంది విద్యార్ధులు అఖిల భారత స్థాయిలో టాప్‌ ర్యాంకులు సాధించగా... 46 మంది విద్యార్దులు ప్రీమియర్‌ ఐఐటీలలో 82 మంది నిట్‌లో ప్రవేశాలు పొంది ఇతర విద్యార్ధులకు దిక్సూచిగా నిలుస్తున్నారు. మరికొందరు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో పైలెట్‌ కోర్సుకు ఎంపికై రికార్డు సృష్టించారు

Social Welfare Students Rising
Social Welfare Students Rising
author img

By

Published : Jan 2, 2023, 5:49 PM IST

సత్తా చాటిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు

వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని వివిధ కోర్సుల్లో అర్హత సాధిస్తూ తాము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు. నీట్‌, ఐఐటి, పైలెట్‌, డిగ్రీ, ఇంటర్‌, ఎస్​ఎస్​సీ ఇలా అన్నింటా ర్యాంకులతో దూసుకుపోతున్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులు అదరగొట్టారు.

లక్షా 56 వేల మంది విద్యార్థుల్లో పలువురు... దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు దక్కించుకున్నారు.నీట్ పరీక్షలో 128 మంది విద్యార్థులు అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. డాక్టర్ కలలను సాకారం చేయడంలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ కోచింగ్ కార్యక్రమం బాగా ఉపయోగపడింది. విజయవంతమైన విద్యార్థుల జాబితాలో వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్ల సంతానం ఉంది.

అలాగే 46 మంది విద్యార్థులు ప్రీమియర్ ఐఐటీలలో, 82 మంది నిట్‌లో అడ్మిషన్ పొందారు. 30 మంది విద్యార్థులు సెంట్రల్‌ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సీట్లు పొందారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపికైన ఇద్దరు విద్యార్ధులు ఎంతో మందికి ఆదర్శమయ్యారు.

కరీంనగర్ రుక్మాపూర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన క్యాడెట్‌లు అశోక్ సాల్, ఉమాకాంత్ యూపీఎస్సీ, సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇద్దరూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణెలో పైలట్ శిక్షణ పొందనున్నారు. అజిం ప్రేమ్ జీ వర్సిటీలో 30 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాలు పొందారు.

జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటిన 41 మంది విద్యార్థులు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో చేరారు. 12 మంది విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించారు. పబ్లిక్‌ పరీక్షల్లోనూ రాణించి సగటు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. డిగ్రీ విద్యార్థులు సైన్స్ మరియు ఆర్ట్స్ స్ట్రీమ్‌లలో రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు కైవసం చేసుకున్నారు.

ఐఐటీల్లో ప్రవేశం పొందిన 397 మంది విద్యార్థులకు.. సొసైటీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించింది. జాతీయస్థాయి విద్యాసంస్థల్లో చేరిన వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. అత్యుత్తమ ప్రతిభతో మెరుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్ధులు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.