ETV Bharat / state

'కంటోన్మెంట్​ నియోజకవర్గంలో కరోనా పరీక్షా కేంద్రాలు పెంచాలి'

హైదరాబాద్​లో విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో కంటోన్మెంట్​ నియోజకవర్గంలో పరీక్షా కేంద్రాలు పెంచాలని సామాజిక కార్యకర్త సతీశ్​గుప్తా డిమాండ్​ చేశారు. ప్రతి బస్తీ, కాలనీలో రోజువారీగా శానిటైజేషన్​ చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సతీశ్​గుప్తా కోరారు.

social activist sateesh guptha demanded for increase corona test centers

author img

By

Published : Jul 28, 2020, 5:17 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కరోనా పరీక్షా కేంద్రాలను పెంచాలని సామాజిక కార్యకర్త సతీశ్​ గుప్తా డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఐదో వార్డు పరిధిలో ఉన్న వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సతీశ్​గుప్తా తెలిపారు. ఈ క్రమంలో నిరుపేదలు పరీక్షలు చేయించుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి వార్డులో వెంటనే ఒక ఉచిత కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి బస్తీ, కాలనీలో రోజువారీగా శానిటైజేషన్​ చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సతీశ్​గుప్తా కోరారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.