ETV Bharat / state

'ఆయిల్ స్ప్రేతో మతబోధకుడి అరాచకాలు' - ANYAYAM

మీకు దయ్యం పట్టిందా... ఆర్థిక స్థితి బాగలేదా... రోగాలు మాయం చేయాలా... సుఖ సంతోషాలతో హాయిగా గడపాలనుకుంటున్నారా... అయితే నా దగ్గరకు రండంటూ పిలుస్తాడు. వచ్చిన వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాంటి దొంగ పాస్టర్​ కటకటాలపాలయ్యాడు.

'ఆయిల్ స్ప్రేతో మతబోధకుడి అరాచకాలు'
author img

By

Published : May 31, 2019, 4:50 PM IST

'ఆయిల్ స్ప్రేతో మతబోధకుడి అరాచకాలు'

నీ భార్య ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది... నువ్వు ఆమెని వదిలెయ్ అని చెప్తాడు. ఒకవేళ ఆ మాటలు నమ్మి భార్యని వదిలేస్తే ఆమెను శారీరకంగా వాడుకుంటాడు సికింద్రాబాద్​కి చెందిన మతబోధకుడు సామ్​సన్. నీకు దెయ్యం పట్టింది వదిలిస్తానంటూ... అమ్మాయిలను నగ్నంగా చేసి స్పృహ తప్పేలా చేసి వారి వీడియోలు తీశాడు.

ఒళ్లంతా కుళ్లబొడుస్తాడు

ప్రార్థన చేసుకునేందుకు వచ్చింది పురుషులు అయితే వారి నోట్లో ఆయిల్ స్ప్రే కొట్టి... వారు స్పహ కోల్పోగానే ఇష్టం వచ్చినట్లుగా ఒళ్లంతా కుళ్లబొడుస్తాడు. ఈ విధంగానే తన దగ్గరకు వచ్చిన కనకరాజు అనే వ్యక్తికి మీ ఇల్లు వాస్తు బాగాలేదు... అమ్మేయండి. లేదంటే మీరు కుటుంబంతో సహా చనిపోతారంటూ భయపెట్టాడు. ఇల్లు అమ్మిన డబ్బులు నాకిస్తే మీ కుటుంబం చల్లగా ఉంటుందంటూ మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన బాధితుడు డబ్బులు పాస్టర్​కు ఇచ్చి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.

మాయలో ప్రభ్యుత్వ ఉద్యోగి

మారేడుపల్లికి చెందిన విజయ్ కుమార్ ఓ ప్రభ్యుత్వ ఉద్యోగి. ఆరోగ్యం బాగాలేదని గత 6 నెలలుగా మత బోధకుడు సామ్​సన్ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రార్థనలతో పాటు ఆయిల్ స్ప్రే చేయించుకుంటున్నాడు. తను స్పృహ కోల్పోయాక ఏం జరుగుతుందో గ్రహించలేకపోయాడు. ఇన్ని చేస్తుంటే ఆరోగ్యం బాగవ్వాల్సింది పోయి ఒళ్లంతా హూనమవుతోంది. విషయం గమనించిన విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతనితో పాటు మరికొంత మహిళలు కూడా తమకు మాయమాటలు చెప్తూ శారీరకంగా లోబర్చుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సామ్​సన్​ని సికింద్రాబాద్ కోర్టులో హాజరు పరిచారు.

న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని న్యాయమూర్తి సూచించారు.

ఇవీ చూడండి: బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.