రెండు పాములను పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్‌ను పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. అంబర్‌పేట్‌లోని సీపీ నివాసానికి సమీపంలో ఉన్న సీపీఎల్ మైదానంలో జెర్రిపోతులు ఒక్కసారిగా చెట్ల పొదల్లోంచి బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
సమాచారం తెలుసుకున్న మలక్‌పేట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్ వెంటనే అక్కడకు చేరుకొని రెండు పాములను పట్టుకున్నారు. వాటిని జంతు ప్రదర్శనశాల అధికారులకు అప్పగించారు. అతని ధైర్యానికి మెచ్చి నగదు బహుమతి, మొమెంటోను సీపీ అంజనీకుమార్ అందజేశారు.