అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో రాష్ట్రంలో భూగర్భ జలాలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ నెలలో రాష్ట్ర భూగర్భ జలమట్టం సగటు 4.49 మీటర్లు కాగా... నవంబర్ నాటికి 0.48 మీటర్లు తగ్గి 4.97గా నమోదైంది. 2020 నవంబర్‌తో పోలిస్తే జలమట్టం చాలా స్వల్పంగా తగ్గింది. గతేడాది నవంబర్‌లో రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు 4.95 మీటర్లు. జిల్లాల వారీగా చూస్తే హన్మకొండ జిల్లా సగటు కనిష్టంగా 2.67 మీటర్లు కాగా... గరిష్టంగా సంగారెడ్డి జిల్లా సగటు 8.30 మీటర్లుగా నమోదైంది.
రాష్ట్రంలోని దాదాపు 62 శాతం మేర విస్తీర్ణంలో భూగర్భ జలాలు ఐదు మీటర్ల లోపే ఉన్నాయి. 33 శాతం మేర ఐదు నుంచి పది మీటర్ల లోపు ఉన్నాయి. నాలుగు శాతం మేర పది నుంచి పదిహేను మీటర్ల లోపు ఉండగా... కేవలం ఒకశాతం విస్తీర్ణం మేర మాత్రమే 15 మీటర్ల పైన భూగర్భ జలాలు ఉన్నాయి. గడచిన పదేళ్లుగా చూస్తే రాష్ట్రంలో అత్యంత లోతులో భూగర్భ జలాలు ఉండే ప్రాంతం దాదాపు 80 శాతం మేర తగ్గినట్లు భూగర్భ జలవనరులశాఖ తెలిపింది.
ఇదీ చదవండి:
CS Meeting on Monkeys: కోతులు, అడవి పందుల కట్టడికి ప్రత్యేక కమిటీ: సీఎస్