ETV Bharat / state

వైఎస్ వివేక హత్యకేసులో ఏం జరుగుతోంది... రెండురోజుల్లో "జగన్​" చేతికి నివేదిక! - viveka

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై సిట్​ నివేదికను రెండురోజుల్లో సీఎం జగన్​కు అందజేసే వీలుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

2 రోజుల్లో సీఎం చేతికి వివేకా హత్య కేసు నివేదిక..!
author img

By

Published : Sep 5, 2019, 8:25 PM IST

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న తుది దశ దర్యాప్తును సమీక్షించడానికి కడపకు వెళ్లిన డీజీపీ గౌతం సవాంగ్.. తిరిగి విజయవాడ చేరుకున్నారు. రెండు రోజుల్లో వివేకా హత్యపై సిట్ దర్యాప్తు నివేదికను ముఖ్యమంత్రికి అందజేసే వీలుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కేసు కీలకదశకు చేరుకున్న తరుణంలో అరెస్టులే తరువాయిగా మారాయి. కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం కడపలోనే మకాం వేశారు. ఎస్పీ అభిషేక్ మొహంతితో కేసుపై ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన తర్వాత అరెస్టుల కోసం రంగంలోకి దిగాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో ఎవరున్నారనేది బయటికి పొక్కకుండా.. పోలీసులు అత్యంత రహస్యంగా దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇవీచూడండి: జన్మ"దినం"... పుట్టినరోజే ఆ కుటుంబానికి చివరిరోజైంది!

Vladivostok (Russia), Sep 05 (ANI): Prime Minister Narendra Modi met Prime Minister of Malaysia Mahathir Mohamad in Russia's Vladivostok. Both the leaders held a meeting to further strengthen the relationship. PM Modi is on two-day visit to Russia to attend 5th Eastern Economic Forum.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.