నయీం కేసులో సిట్ దర్యాప్తు పూర్తికావొచ్చింది. అతని అక్రమ ఆస్తులు రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు విచారణ బృందం గుర్తించింది. వేయి ఎకరాల భూమి, ఇళ్ల స్థలాలు, 29 భవనాలు, రూ.2 కోట్లకు పైగా నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలతో సహా ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు గుర్తించి సీజ్ చేశారు. నయీంపై ఇప్పటివరకు 200కు పైగా కేసులున్నాయి. వీటిలో ఆధారాలు లేని వాటిని న్యాయస్థానం అనుమతితో మూసేశారు.
కుడిభుజం శేషన్న కోసం గాలింపు
నయీం కుడిభుజంగా పేరొందిన శేషన్న కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఇతను రెండున్నరేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసుల కన్నుగప్పి మకాం మారుస్తున్నట్లు సిట్ గుర్తించింది. ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే రెండు నెలల్లోనే కేసులన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమజంట ఆత్మహత్య