సినీ సాహిత్య వ్యవసాయంలో తనకు లభించిన ఫలసాయం పద్మశ్రీ పురస్కారమని సిరివెన్నెల సీతారామశాస్త్రీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ పార్క్ హోటల్లో తెలుగు చలన చిత్ర మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయసమావేశానికి హాజరయ్యారు. తనకు పద్మశ్రీ రావాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆకాంక్షించారని తెలిపారు. తన పాటల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ... సినీ రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువగా ఆరాధిస్తానని స్పష్టం చేశారు.