గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యుల ఎన్నికల్లో ప్రచార అనుమతుల కోసం ఏకగవాక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఎన్నికల్లో ప్రచార సంబంధిత కార్యక్రమాలైన ర్యాలీలు, పాదయాత్రలు, సమావేశాలు, సభలు, వాహనాల అనుమతులు, వాహనాల పాసులను జారీ చేయడానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విభాగానికి జీహెచ్ఎంసీ ఓఎస్డీ అనురాధను నియమిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అనుమతుల నిమిత్తం అన్ని కార్యాలయాలు తిరగకుండా ఒకే దగ్గర అనుమతులు పొందొచ్చని సూచించారు.