ETV Bharat / state

Singareni Elections Schedule Telangana 2023 : సింగరేణిలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్ - Telangana Assembly Election 2023 Latest News

Singareni Elections Schedule Telangana 2023 : సింగరేణి సంస్థలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 28న ఎలక్షన్స్ నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్​ను ప్రకటించారు.

Singareni Election
Singareni Colliery Company limited
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 10:20 AM IST

Singareni Elections Schedule Telangana 2023 : సింగరేణిలో ఎన్నికల (Singareni Election) సైరన్‌ మోగింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వచ్చే నెల 28న నిర్వహించేందుకు.. ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు.

ఎన్నికల షెడ్యూల్​..

  • ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 30న కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి అందజేత
  • వచ్చేనెల​ 3 వరకు అభ్యంతరాలు స్వీకరణ
  • వచ్చేనెల​ 5న ఓటర్ల తుది జాబితా ప్రదర్శన
  • వచ్చేనెల​​ 6న ఉదయం 10:00 గంటల నుంచి.. 7వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ
  • వచ్చేనెల​ 9న ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం

అర్హులైన అభ్యర్థులకు వచ్చేనెల 10న మధ్యాహ్నం ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. 28న ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు రాత్రి 7:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు

Singareni generates Solar Power : 2024 సింగరేణి టార్గెట్.. 2 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి

అయినా.. ఎన్నికలు జరిగేనా? : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనా.. ఎలక్షన్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణలో వచ్చే నెల మొదటి వారంలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఈ పనిలో నిమగ్నమై ఉంది. 42,000 పైగా ఓటర్లున్న సింగరేణిలో ఎన్నికలకు.. భారీ బందోబస్తుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సేవలు అవసరం.

Singareni Colliery Company Limited : ఈ నేపథ్యంలోనే సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలు సింగరేణి ఎన్నికలలో పాల్గొనలేమని ఎన్నికల అధికారికి వెల్లడించారు. మరోవైపు కార్మిక సంఘాల్లో అధికశాతం ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని.. సింగరేణి సంస్థలోని 13 యూనియన్లు లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారి శ్రీనివాసులును కోరాయి. అలాగే గెలిచిన సంఘం కాలపరిమితి.. గత ఒప్పందాల అమలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి.

వీటితోపాటు సింగరేణి ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉంది. మరోవైపు సింగరేణిలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఇందుంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 20కి పైగా మైనింగ్‌ సంస్థల బృందాలు రానున్నాయి. 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధం అవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా షెడ్యూల్​ను విడుదల చేశారని సంఘాలు చెబుతున్నాయి.

బొగ్గు ఉత్పత్తిలో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సింగరేణి

మరోవైపు సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 32 శాతం వాటాను ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 42,390 మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ.711 కోట్లను జమ చేయనుంది.

Mining Engineering Course : ఛాలెంజింగ్ జాబ్ కావాలంటే.. 'మైనింగ్​'లో చేరాల్సిందే!

Greenery in Singareni Coal mines area : బొగ్గుగనుల్లో పచ్చదనం.. పర్యావరణ సమతౌల్యానికి చెట్ల పెంపకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.