సింగరేణి కాలరీస్ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌కు అంతర్జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ఆసియా వన్ ప్రతిఏటా ప్రకటించే ‘ది లీడర్’ అవార్డుకు శ్రీధర్‌ను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 7న బ్యాంకాక్‌లో జరగనున్న కార్యక్రమంలో శ్రీధర్ ఈ అవార్డును అందుకోనున్నారు.
ఆసియాలో వాణిజ్య, పరిశ్రమల విభాగంలో ఎంపిక చేసినటువంటి అత్యంత ప్రతిభావంతుల జాబితాలో రెండు దశల్లో పరిశీలించిన తర్వాత ఈ అవార్డుకు శ్రీధర్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సింగరేణి సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తూ అద్భుతమైన వృద్ధి రేటును సాధిస్తున్నందుకు గుర్తింపుగా శ్రీధర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారని మ్యాగజిన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అవార్డు సింగరేణి కార్మికుల కృషికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నానని సీఎండీ శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు, అధికారుల సమష్టి కృషి, సహకారం వల్లే సంస్థ అత్యున్నత స్థాయికి ఎదుగుతుందన్నారు.
ఇదీ చూడండి: మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం