ETV Bharat / state

ఏడాదికి 70 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం: సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ - సింగరేణి సీఎండీ సమీక్ష సమావేశం

సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న ఏడాదికి 70 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యాల సాధనలో భూగర్భ గనులు కూడా ముఖ్య పాత్ర పోషించాలని, ముఖ్యంగా యాంత్రీకరణ గనుల్లో ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందని సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అన్నారు. సింగరేణిలోని అన్ని ఏరియాల పనితీరు, ఉపరితల గనులు, సీహెచ్​పీలు పనితీరుపై గత రెండు రోజులుగా సీఎండీ సమీక్షిస్తున్నారు.

Singareni CMD N. Sridhar Review Meeting
సింగరేణి సీఎండీ సమీక్ష సమావేశం
author img

By

Published : Sep 4, 2021, 10:15 AM IST

సింగరేణిలోని అండర్‌ గ్రౌండ్‌ మెకనైజ్డు గనులైన అడ్రియాల లాంగ్​వాల్‌ ప్రాజెక్టు మరియు జీడీకే-11 ఇంక్లైన్‌, పీవీకే-5 ఇంక్లైన్‌, కొండాపురం, వకీల్​పల్లి గనుల్లోని కంటిన్యూయస్‌ మైనర్స్‌ బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేకంగా సమీక్షించారు. అడ్రియాలలో నిర్దేశిత 2 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎండీ దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అడ్రియాలలో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేదని, రానున్న 7 నెలల కాలంలో పుంజుకొని ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని ఆదేశిచారు. యంత్రాల బ్రేక్‌ డౌన్‌ కారణంగా ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని,దాని తగ్గించే ప్రయత్నం చేయాలని యంత్రాల పనిగంటలను సైతం పెంచాలని..అందుకు కావలసిన విడి పరికరాలు, పంపులను సకాలంలో సమకూర్చుకోవాలని ఆదేశించారు.

కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇంక్లైన్​లో ఐదు నెలల్లో 35.94 శాతం ఉత్పత్తి సాధించారని, నెలకు 37,500 టన్నుల ఉత్పత్తి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎండీ అన్నారు. కొండాపురం గనిలో సాంకేతిక సమస్యలను (ఫాల్ట్స్) అధిగమించి ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సీఎండీ సూచించారు.

శాంతిఖని గని నుంచి తీసుకొచ్చిన కంటిన్యూయస్‌ మైనర్​ను ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-11 ఇంక్లైన్​లో త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏరియా అధికారులు తెలిపారు. రోజుకు వెయ్యి టన్నుల ఉత్పత్తిని సాధించాలని సీఎండీ ఆదేశించారు. వకీలుపల్లి గనిలో కంటిన్యూయస్‌ మైనర్​ను వి.కె. 7 నుండి ఈ నెలలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అక్కడ ఉత్పత్తి పెరగాలన్నారు.

ఇదీ చదవండి:WEATHER REPORT: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఇవాళ, రేపు భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.