జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధుశర్మకు పెద్దకూతురును అప్పజెప్పాలని హైకోర్టు ఆదేశించింది. వారంలో ఐదు రోజులు తల్లివద్ద, రెండు రోజులు తండ్రి వద్ద రిషిత ఉండేలా తీర్పు ఇస్తూ... తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలంటూ సింధుశర్మ జూబ్లీహిల్స్‌లోని జస్టిస్ నూతి రామ్మోహనరావు ఇంటి ఎదుట మహిళా సంఘాలతో కలిసి ఆదివారం ఆందోళనకు దిగారు. చిన్నపాపను ఇచ్చినప్పటికీ పెద్దపాపను ఇవ్వడానికి ఆమె భర్త వశిష్ట అంగీకరించలేదు. భరోసా కేంద్రాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీనిపై సింధుశర్మ బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ధర్మాసనం విచారణ జరిపింది. కుటుంబసభ్యులతో కాకుండా భర్తతో వేరుగా కలిసి ఉంటామని సింధుశర్మ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనికి ఆమె భర్త వశిష్ట అంగీకరించలేదు.
ఇదీ చదవండి : పెద్దకుమార్తె కోసం హైకోర్టులో సింధుశర్మ పిటిషన్