ETV Bharat / state

మహిళా పారిశ్రామికవేత్తలకు సిడ్బీ ప్రోత్సాహకాలు - నాంపల్లి నుమాయిష్​

చిన్న తరహా పరిశ్రమ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు భారతీయ లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు చేయూతనందిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో బ్యాంక్ ద్వారా మహిళలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంటుంది. 14 స్టాల్స్ కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఉత్పత్తుల ప్రదర్శనకు వచ్చిన మహిళలు అమ్మకాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.80 లక్షల అమ్మకాలు జరిగాయి.

సిడ్బీ
sidbi
author img

By

Published : Feb 17, 2023, 11:03 AM IST

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పాలని భావిస్తున్న మహిళలను సిడ్బీ(భారతీయ లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు) ప్రోత్సాహకాలు అందిస్తోంది. పలు ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి ఉచిత స్టాళ్ల ఏర్పాట్లను చేస్తోంది. అయితే నిర్వాహకుల్లో నైపుణ్యం కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వారిలో నైపుణ్యాలు పెంచే విధంగా కృషి చేస్తూనే మార్కెటింగ్​ అవకాశాలను కల్పిస్తోంది. అయితే ఇటీవల జరిగిన నాంపల్లి నుమాయిష్​లో 14 స్టాళ్లను ఏర్పాటు చేసి సుమారు రూ. 20లక్షల వరకు సిడ్బీ వెచ్చించింది.

అలాగే గతేడాది జరిగిన సరస్​ ఫెయిర్​-2022లోనూ షాపులను ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రదర్శనల్లో సుమారు 100 మందికి అవకాశం కల్పించగా.. 1900 మంది మహిళలకు బ్యాంక్​ అండగా నిలిచింది. చెక్కబొమ్మలు, లెదర్​ బ్యాగులు, బయో ఉత్పత్తులు, చేతివృత్తులు తదితర తయారీ యూనిట్లు సుమారు 150కి పైగా సిడ్జీ పరిశీలనలోనే ఉన్నాయి. వీటి ఏర్పాటుకు సుమారు రూ.10లక్షల నుంచి రూ.80లక్షల వరకూ ఖర్చవుతుందని సిడ్బీ అంచనా వేస్తోంది. ఇవి నెలకొల్పడానికి.. బయట బ్యాంకు రుణాలు పొందేందుకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయని యాజమాన్యం తెలిపింది. కానీ ఇలాంటి వారికి సిడ్బీ మార్గదర్శకంగా నిలుస్తోంది.

తమ వ్యాపార అభివృద్ధికి సిడ్బీ బ్యాంక్ అధికారులు ఒక వేదికను ఇచ్చారని స్టాల్స్ నిర్వహిస్తున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. వారు స్వతహాగా అభివృద్ధి చెందేందుకు ఉపాధి కల్పిస్తున్నారని.. అలాగే వివిధ వస్తువుల తయారీకి మరికొంత మంది మహిళలకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్​, కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేసే వారిమి.. ఇప్పుడు ఆ ఉద్యోగాలు మానేసి ఈ వ్యాపారంలో రాణిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.

ఎన్ఐఆర్​లోని రూరల్ టెక్నాలజీ పార్కు ద్వారా సాంకేతిక అంశాల్లో శిక్షణ అందిస్తున్నాామని శివకుమార్​, సిడ్బీ ఎగ్జిక్యూటివ్​ తెలిపారు. అమెజాన్ సంస్థ ప్రతినిధులు ఆన్​లైన్​లో విక్రయాల గురించి వివరిస్తారని పేర్కొన్నారు.. మూడేళ్లుగా నుమాయిష్​లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.