ETV Bharat / state

హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు.. అనుకూలంగా తీర్పు - constable candidates judgement

high court
high court
author img

By

Published : Feb 8, 2023, 7:03 PM IST

Updated : Feb 9, 2023, 6:32 AM IST

18:59 February 08

అర్హతగల అభ్యర్థులకు మరోసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు

High Court SI, Constable Candidates judgment: పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన దేహదారుడ్య పరీక్షల్లో 1సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు పోలీస్ నియామక మండలి మరో అవకాశాన్ని కల్పించింది. హైకోర్టు ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు తిరిగి మరోసారి ఎత్తును కొలవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని అంబర్ పేట సీపీఎల్ మైదానం, కొండాపూర్​లోని 8వ పోలీస్ బెటాలియన్ మైదానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు పోలీస్ నియామక మండలి వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. ఆన్​లైన్​ చేసిన పత్రాలను డౌన్​లోడ్ చేసుకొవాలని అధికారులు సూచించారు.

తిరిగి ఎత్తు కొలిచే ప్రక్రియలో అభ్యర్థులు దరఖాస్తు పత్రాలను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో నిర్దేశించిన ఎత్తుకంటే 1 సెం.మీ తక్కువ ఎత్తు ఉన్న వాళ్లను అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఆయా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సదరు అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని హైకోర్టు ఆదేశించడంతో పోలీస్ నియామక మండలి ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 9, 2023, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.