ETV Bharat / state

సైబరాబాద్ కమిషనరేట్​లో శ్రీరామ్ పాట ఆవిష్కరణ

author img

By

Published : Aug 15, 2020, 6:23 PM IST

పాట వెనుక ఉన్న స్పూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్​ అన్నారు. దేశం మన కోసం ఏం చేసిందని కాకుండా... దేశం కోసం మనం ఏం చేశామని భావించాలని ఆయన సూచించారు. సినీ గాయకుడు శ్రీరామ్ ఆలపించిన గీతాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించారు.

Shriram song launch at Cyberabad Commissionerate
సైబరాబాద్ కమిషనరేట్​లో శ్రీరామ్ పాట ఆవిష్కరణ

సైబరాబాద్ కమిషనరేట్​లో శ్రీరామ్ పాట ఆవిష్కరణ

సమాజంలోని పౌరులంతా దేశ భద్రత, అభివృద్ధి కోసం కృషి చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామ్ ఎస్5 చిత్రం కోసం ఆలపించిన ఐయామ్ ఇండియన్ ప్రత్యేక గీతాన్ని సైబరాబాద్ కమిషనరేట్​లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎస్5 చిత్ర బృందానికి సజ్జనార్ అభినందనలు తెలిపారు. పౌరులంతా ఈ వినాయక చవితికి సీడ్ గణేశులను ప్రతిష్టించి పర్యావరణ హితం కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్యనటుడు అలీతోపాటు నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు సన్ని పాల్గొన్నారు.

ఇదీ చూడండి : గోదారమ్మ ఉగ్రరూపం... భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.