Show Cause notice to MLA Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళవారం మంగళ్‌హాట్ పోలీసులు షోకాజ్ నోటీసు జారీచేశారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఉంచారని పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించగా అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించి విడుదలయ్యారు. ఆ సందర్భంగా బహిరంగంగా, సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించారంటూ పోలీసులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రెండురోజుల్లో షోకాజు నోటీసుకు సమాధానం ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి: