ETV Bharat / state

అమెరికా వెళ్లేందుకు శివాజీకి హైకోర్టు అనుమతి - shivaji

సినీ నటుడు శివాజీకి మూడు వారాలు పాటు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. శివాజీపై సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన లుకౌట్‌ సర్క్యులర్ నోటీసులు కూడా క్లియర్ అయ్యేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది.

శివాజీకి అనుమతి
author img

By

Published : Aug 7, 2019, 9:29 PM IST

Updated : Aug 7, 2019, 10:43 PM IST

అమెరికా వెళ్లేందుకు శివాజీకి హైకోర్టు అనుమతి

సినీ నటుడు శివాజీకి ఊరట లభించింది. మూడు వారాలు పాటు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. గత నెల 3న అమెరికా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. లుకౌట్‌ నోటీసులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు ఉపసంహరించుకోలేదని శివాజీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆయన అమెరికా వెళ్తుండగా పోలీసులు ఆపారన్నారు. దుబాయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కూడా ఆపి వెనక్కి పంపారని వివరించారు. ఇమ్మిగ్రేషన్‌ వెబ్‌సైట్‌లో లుకౌట్‌ నోటీసులు తొలగించలేదన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని న్యాయవాది కోరారు.

సమాచారం లోపం వల్లే

గత నెల 24న హైకోర్టు తీర్పు రావడం వల్ల శివాజీ 25న అమెరికా వెళ్లారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత లుకౌట్‌ నోటీసులు తొలగించడానికి మూడు రోజులు పడుతుందని పేర్కొన్నారు. భారత్‌లో ఎవరు కూడా శివాజీని ఆపలేదన్నారు. దుబాయ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ఆపినట్లు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. ఇదంతా సమాచార లోపం వల్ల జరిగిన తప్పిదమని పేర్కొంది. రేపటి నుంచి మూడు వారాల వరకు అమెరికా వెళ్లేందుకు శివాజీకి హైకోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

Intro:Body:Conclusion:
Last Updated : Aug 7, 2019, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.