సికింద్రాబాద్ గణపతి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుడిని రకరకాల పూలు, పండ్లు, కూరగాయలతో అలంకరించారు.
గత 15 సంవత్సరాలుగా తమ కుటుంబం గణపతి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మహేందర్ పేర్కొన్నారు. అత్యంత ప్రీతికరమైన గణనాథునికి శాకంబరీ అలంకరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు 700 కిలోల కూరగాయలు స్వామి వారికి అలంకరించినట్లు తెలిపారు.
ఇదీచూడండి.. 'కరోనా వైరస్ మళ్లీ తిరగబెట్టవచ్చు... అప్రమత్తత అవసరం'