ETV Bharat / state

త్యాగం పరిహాసం.. ముంపు గ్రామాలకు పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం - flooded villages facing problems

సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ పొలాలను.. పుట్టి పెరిగిన ఊళ్లను త్యాగం చేస్తున్న వారి పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా తయారవుతోంది. వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ముంపు గ్రామాలకు పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం వారి పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టుల పరిధిలోని ముంపు గ్రామాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ పర్యటించగా అనేక కన్నీటి గాథలు కనిపించాయి.

త్యాగం పరిహాసం.. ముంపు గ్రామాలకు పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం

author img

By

Published : Jun 5, 2022, 4:43 AM IST

సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ పొలాలను.. పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేస్తున్న వారి కన్నీళ్లను తుడిచేవారు కరవయ్యారు. కనీసం వారి బాధలు వినేవారూ లేరు. సాగు భూములకు చెల్లించే పరిహారం చేతికి అందేనాటికి సమీపంలోని భూముల ధరలు రెట్టింపు అవుతున్నాయి. ఇచ్చే డబ్బుతో వేరేచోట అరెకరం కూడా రాని పరిస్థితి ఉంది. ఇక నివాస స్థలాలకు, ఇళ్లకు ప్రాజెక్టు పనులు చేపట్టిన ఏడేళ్లకు కూడా పూర్తిస్థాయి పరిహారం ఇవ్వడం లేదు. పొలాలు కోల్పోయిన ప్రజలు ఆ గ్రామంలో ఉండి ఎలా ఉపాధి పొందుతారన్న ఆలోచననూ యంత్రాంగం చేయడం లేదు. పైగా గ్రామాల చుట్టూ కందకాలు తవ్వుతుండటం, వర్షాకాలం సమీపిస్తుండటంతో ఎక్కడ వరద ముంచెత్తుతుందోననే భయంతో స్థానికులు హడలిపోతున్నారు. ఇటీవల పరిహారం కోసం ఆందోళనచేస్తూ చర్లగూడెం గ్రామానికి చెందిన నాగిళ్ల లక్ష్మమ్మ గుండె ఆగి మరణించడం, మరికొన్ని గ్రామాల్లో దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాజెక్టుల పరిధిలోని ముంపు గ్రామాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ పర్యటించగా అనేక కన్నీటి గాధలు కన్పించాయి.

.

బాండు పేపర్‌తో మస్కా..

2015 జూన్‌ 11వ తేదీన అంకురార్పణ జరిగిన శ్రీరామరాజు విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం కింద నల్గొండ, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. దీని కింద ఎనిమిది జలాశయాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి మండలాల్లో నిర్మాణంలో ఉన్న శివన్నగూడెం, కిష్టరాయనపల్లి జలాశయాల పరిధిలో పునరావాస ప్రక్రియ గందరగోళంగా మారింది. నిరసనగా ఈ రెండింటి పరిధిలోని గ్రామాల వారు దీక్షా శిబిరాలు ఏర్పాటుచేసుకుని పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయాలు, ప్రాజెక్టు క్యాంపుల వద్ద రోజూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శివన్నగూడెం జలాశయం కింద చర్లగూడెంలో బాధితుల ఇళ్లకు పరిహారం చెల్లింపు గడువును యంత్రాంగం పొడిగిస్తూ వస్తోంది. ‘నలభై రోజుల్లో ఇస్తామని రెండుసార్లు గడువు ఇచ్చిన అధికారులు పరిహారం పంపిణీతో సంబంధంలేని గుత్తేదారు సంస్థ నిర్వాహకులతో సంతకాలు చేయించి తమను మభ్యపెడుతూ వస్తున్నారని’ చర్లగూడెం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తాము పనులు అడ్డుకుంటున్న ప్రతిసారీ ఇలా ఏదో ఒక సాకు చూపుతున్నారని వాపోతున్నారు. కిష్టరాయనపల్లి జలాశయం ముంపు బాధితులు కూడా ఇళ్లకు సంబంధించిన పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి చింతపల్లి మండలంలో ప్లాట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప ఇప్పటికీ అప్పగించింది లేదనేది వారి ఆవేదన.

.

అభివృద్ధి పేరుతో నిధులు కత్తిరించి..

2015 జూన్‌ పదో తేదీన ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లా పరిధిలోని 12.30 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. దీనికోసం ప్రస్తుతం ఐదు జలాశయాలు నిర్మిస్తున్నారు. కర్వెన జలాశయం మినహా మిగిలిన వాటిలో పునరావాస ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వెంకటాద్రి (వట్టెం) జలాశయం కింద ముంపు బాధితులకు ఇళ్ల స్థలాలు నేటికీ కేటాయించలేదు. ఇంటికి పరిహారం కింద రూ.16.50 లక్షలు మంజూరు చేయగా, అందులో రూ.5.50 లక్షలు స్థలం అభివృద్ధి కింద మినహాయించుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మిగిలిన డబ్బుతో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

పిల్లనిచ్చేటోళ్లు లేరు..

ముంపు గ్రామాల్లోని యువతకు ఆడపిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ‘‘పొలం, ఇళ్లు పోయాయి. ఇప్పటికీ ఎక్కడ ఇళ్లు ఇస్తారో తెలియదు. అసలు ఇస్తారో లేదో స్పష్టత లేదు. దీంతో అడ్రస్‌ లేని వాళ్లుగా మమల్ని పరిగణిస్తున్నారు. మేనరికాలు, దగ్గరి బంధువులు కూడా ఆడపిల్లల్ని ఇచ్చేందుకు వెనకాడుతున్నారు’’ అని అన్ని ముంపు గ్రామాల బాధితులు ‘ఈనాడు’ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నివాస స్థలాలు కేటాయించకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు.

ముహూర్తం ముంచుకొస్తున్నా... పైసల్లేవ్‌..

.

శుభలేఖ పట్టుకుని కూర్చున్న ఈ యువతి కాబోయే పెళ్లి కూతురు. 9వ తేదీన పెళ్లి ముహూర్తం. ఆ పక్కనే తల్లి వెంకటమ్మ. డిండి ప్రాజెక్టులోని శివన్నగూడెం జలాశయం ముంపులో పోతున్న మర్రిగూడ మండలం చర్లగూడెం వీరి గ్రామం. ‘కొత్తబట్టలు, బంగారం, పెళ్లి సామగ్రి...ఇలా ఎన్నో కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో పైసలు లేవని, నాలుగు నెలలుగా ఇదిగో అదిగో..పరిహారం ఇస్తామని చెబుతుండటంతో ఊర్లోకి వచ్చిపోయే అధికారుల వైపు దీనంగా చూస్తూ ఉండిపోయామని’ తల్లీకూతుళ్లు నిస్సహాయత వ్యక్తంచేశారు.

.

ఇంటి ప్రహరీ వరకు ఇరవై అడుగుల లోతులో తవ్విన గొయ్యి చూపుతున్న వీరు మర్రిగూడ మండలం చర్లగూడెం గ్రామస్థులు. ఈ గ్రామం శివన్నగూడెం జలాశయం ముంపులో పోతుండటంతో ఖాళీ చేయించే క్రమంలో గుత్తేదారులు ఇలా ఇళ్ల చుట్టూ కందకాలు తవ్వారు. ఇళ్ల పరిహారం ఇస్తే ఖాళీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఇవ్వకుండానే గోతులు తవ్వుతుండటంతో నిరసనగా గ్రామస్థులు నెల రోజులుగా పనులు నిర్వహిస్తున్న క్యాంపు వద్ద దీక్ష చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం గ్రామానికి చెందిన నాగిళ్ల లక్ష్మమ్మ గుండె ఆగిపోయి మృతిచెందారు కూడా.

.

ఒకప్పుడు పట్టణానికి పాలు పంపిన ఆ పల్లె ఇప్పుడు పట్నం నుంచి వచ్చే పాలపాకెట్లపై ఆధారపడుతోంది. చిన్నారులూ ఆ పాల కోసం నిత్యం ఎదురుచూడాల్సిన దుస్థితి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే వెంకటాద్రి (వట్టెం) జలాశయం ముంపులో పోతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం అనేఖాన్‌పల్లె దుస్థితి ఇది. 462 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 1,600 పశువులు ఉండేవి. గ్రామానికి కావాల్సిన పాడిని అవి సమకూర్చేవి. ఇప్పుడు పొలాలతోపాటు ఊరు ముంపులో పోతుండటంతో పశువులను అమ్మేశారు. ఇప్పటికీ పునరావాస కాలనీ సిద్ధం కాకపోవడంతో బరువెక్కిన గుండెలతో గ్రామంలోనే ఉంటున్నారు. కొన్ని గ్రామాల్లో తీవ్ర అనారోగ్యం బారిన పడిన వారు ఎందరో ఉన్నారు. పరిహారం వచ్చాక శస్త్రచికిత్సలు చేయించుకుందామనే ఆశతో ఎదురుచూస్తున్నామని, అది వచ్చేదాకా ఉంటామో..పోతామో తెలియకుందని వారు చెబుతున్నారు.

ఇదీ చూడండి..

కార్పొరేట్ స్కూల్‌ పేరు మీద లేఖతో పబ్‌లో పార్టీకి అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.