హైదరాబాద్ ఖైరతాబాద్కు చెందిన అభ్యాస్ ఏడో తరగతి విద్యార్థి. కరోనా నియంత్రణపై వినూత్న శైలిలో అవగాహన కల్పించాడు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మాదిరిగా లాక్డౌన్లో పాటించాల్సిన నిబంధనలను వివరించాడు.
దేశ రాజధానిలో కరోనా పరిస్థితులు... అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాడు. ప్రజలందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని అభ్యాస్ కోరాడు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలని సూచించాడు.
రోజు రోజుకు కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో 5టీ ప్లాన్ ద్వారా ఆమ్ ఆద్మీ ప్రభుత్వ చర్యలను అభ్యాస్ పేర్కొన్నాడు.
- టెస్టింగ్ (పరీక్షలు నిర్వహించటం)
- ట్రేసింగ్ (ఆచూకీ కనుగొనటం)
- ట్రీట్మెంట్ ( చికిత్స)
- టీం వర్క్ (సమష్టి కృషి)
- 5 ట్రాకింగ్ (మార్గం ఏర్పాటు)
ఈ ప్లాన్ సమర్థంగా అమలు చేయడం ద్వారా కరోనాను కట్టడి చేయగలమని అభ్యాస్ తెలిపాడు.