ETV Bharat / state

TDP Office: తెదేపా కార్యాలయంపై దాడి కేసు... మరో ఏడుగురు అరెస్టు - attack on TDP central office in mangalagiri

తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు తెదేపా కేంద్ర కార్యాలయంపై ఈ నెల 19న అల్లరిమూకలు చేసిన దాడి ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో వెలుగు చూసింది.

TDP Office
తెదేపా కార్యాలయంపై దాడి
author img

By

Published : Oct 26, 2021, 9:03 AM IST

తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై ఈ నెల 19న అల్లరిమూకలు చేసిన దాడి ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో వెలుగు చూసింది.

కార్యాలయం ప్రాంగణం లోపల పార్కింగ్‌ చేసిన ఓ కారు అద్దాల్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇద్దరు యువకులు ఒకరు తర్వాత మరొకరు పెద్ద కర్ర చెక్కలు పట్టుకుని కారు అద్దాల్ని పగలకొడుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ తర్వాత వారిరువురూ కార్యాలయం లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడుతున్న దృశ్యాలూ ఉన్నాయి. ధ్వంసానికి పాల్పడిన అల్లరిమూకలే సెల్‌ఫోన్లో ఈ వీడియోను తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయిస్తున్నారని తెదేపా వర్గాలు ఆరోపించాయి.

ఇదీచదవండి: TSRTC Revenue Loss: నష్టాల్లో ఆర్టీసీ... దీపావళి తర్వాత ఛార్జీల పెంపు!

Inter First Year Exams 2021: అధికారుల తప్పులు.. విద్యార్థులకు తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.