ఈనాడు సీనియర్ ఫొటో జర్నలిస్ట్ రాజమౌళి అనారోగ్యం కారణంగా రెండు రోజుల కిత్రం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తస్రావం జరిగినందున శస్త్ర చికిత్స చేశారు. చికిత్స పొందుతూ రాజమౌళి ఉదయం కన్నుమూశారు. 57 ఏళ్ల రాజమౌళి 1985లో ఫొటో జర్నలిస్టుగా ఈనాడులో చేరి చివరి శ్వాస వరకు సంస్థలోనే కొనసాగారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనాడులో సీనియర్ ఫొటోగ్రఫీ పాత్రికేయునిగా రాజమౌళి మూడు దశాబ్దాలుగా సేవలందించారు. ఆయన ఎన్నో ఉత్తమ చిత్రాలతో తన ప్రతిభను చాటి అనేక అవార్డులు అందుకున్నారు. వృత్తి నిబద్ధతలో ఆయనకు ఆయనే సాటి.
రాజమౌళి బౌతిక ఖాయాన్ని ఈనాడు తెలంగాణ సంపాదకులు డి.ఎన్. ప్రసాద్ సందర్శించారు. పాత్రికేయునిగా సమాజానికి రాజమౌళి అందించిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి సానుభూతి తెలిపారు. అందరితో స్నేహంగా మెలిగే రాజమౌళి ఇక లేరు అని తెలుసుకున్న సహచర పాత్రికేయులు కన్నీరుమున్నీరయ్యారు. పార్థివ దేహాన్ని మల్కాజ్‌గిరిలోని ఆయన నివాసానికి తరలించారు. అతని మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.
సీఎం కేసీఆర్ సంతాపం
రాజమౌళి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజమౌళి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో ఉన్న ఆనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్
రాజమౌళి కుటుంబసభ్యులకు పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాత్రికేయునిగా రాజమౌళి సేవలను ఉత్తమ్ కొనియాడారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు