దత్తాత్రేయకు ప్రొటోకాల్ పాటించలేదని పాత్రికేయుడి ధర్నా ఓ కార్యక్రమానికి వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ప్రొటోకాల్ పాటించడం లేదని... హైదరాబాద్ రవీంద్రభారతి ముందు సీనియర్ ప్రాతికేయుడు పాశం యాదగిరి ఆందోళనకు దిగారు. కిన్నెర ఆర్ట్ థియోటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ నాటక రచయిత సి.ఎస్. రావు రచించిన కేవీ రమణాచారి ఉద్యోగ పర్వం పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయను పిలిచారు. బ్యానర్‌పై దత్తాత్రేయ పేరు, ఫొటో పెట్టకపోవడం వల్ల అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం-భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో పాటు నిర్వాహకులను... యాదగిరి నిలదీశారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఒక ప్రాంతం (ఆంధ్ర) వారికే సమావేశ మందిరాలు కేటాయిస్తూ... తెలంగాణ వారికి వివక్ష చూపుతున్నారని యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రభారతి ముందే బైఠాయించడం వల్ల... పాశం యాదగిరిని సైఫాబాద్ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు