ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు - 36 fast track courts established for rape case hearing

రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు

author img

By

Published : Dec 19, 2019, 7:07 PM IST

Updated : Dec 19, 2019, 8:33 PM IST

19:03 December 19

రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు

36-fast-track-courts-established-for-rape-case-hearing

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర విచారణ కోసం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో రెండు చొప్పున.. మిగతా జిల్లాల్లో ఒకటి చొప్పున ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది.

ఏడాది పాటు 

నేటి నుంచి ఏడాది పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తాయని జీవోలో పేర్కొంది. అదనపు జిల్లా సెషన్స్ కోర్టు హోదాలో పనిచేస్తాయని తెలిపింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను సత్వర విచారణ జరిపి.. తీర్పులు ఇచ్చేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జులై 25న ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు 

సుప్రీంకోర్టు తీర్పు మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ సెప్టెంబరు 5న హైకోర్టులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈనెల 2, 5 తేదీల్లో హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. 

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ నిర్మల్ జిల్లా బైంసా ఎంపీడీవో కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సుమారు 154 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు, అనంతరం ఎమ్మెల్యే ముధోల్ మండలం తరోడా గ్రామంకు విచ్చేసి తరోడా చర్చి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి క్రిస్మస్ సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముధోల్ నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించిన క్రిస్మస్ సోదరులకు దుస్తులను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు, మొదటగా, క్రిస్మస్ సంబరాలను ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించి కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఏసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనగా పలువురు మహిళలకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతులమీదుగా క్రిస్మస్ సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు.
Last Updated : Dec 19, 2019, 8:33 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.