టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు, రేవంత్ అరెస్ట్‌పై ఆచరించాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, సురేష్ షెట్కార్, విశ్వేశ్వరరెడ్డి, రాజయ్య, మల్లు రవి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ తోపాటు మాజీ శాసనసభ్యులు, యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'పబ్లిక్ లీడర్ ఇల్లు చూడొద్దా'