ETV Bharat / state

Jairam Ramesh on Munugode By Poll : 'అక్కడ జరిగింది.. ఓట్ల ఎన్నికలు కాదు.. నోట్ల ఎన్నికలు' - Jairam Ramesh on Munugode By election

Jairam Ramesh on Munugode By Poll: మునుగోడులో మద్యం, మనీతోనే ఎన్నికలు జరిగాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతి గట్టిగా పోరాటం చేశారని ఆయన కొనియాడారు. మద్యం ఏరులై పారిందని, దీనికి కోట్లలో ఖర్చు చేశారని అన్నారు. కేవలం మందు, మనీ పంపిణీ చేయడానికే నియోజకవర్గంలో పెద్ద పెద్దనాయకులు, అధికార యంత్రాంగాన్ని దించారని విమర్శించారు.

Congress leader Jairam Ramesh
Congress leader Jairam Ramesh
author img

By

Published : Nov 7, 2022, 2:03 PM IST

Jairam Ramesh on Munugode By Poll: మునుగోడు ఎన్నికల్లో ఓట్లు కాదు.. నోట్ల వరద పారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్ విమర్శించారు. అవి ఓట్ల ఎన్నికలు కాదని నోట్ల ఎన్నికలని అన్నారు. అక్కడ నిన్న ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, మనీయే విజయం సాధించాయని.. అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు. కోట్లు సంపాదించిన వారితో ఓ సామాన్య నాయకురాలు ఎన్నికల్లో పోరాడాల్సి వచ్చిందని తెలిపారు.

"తెలంగాణలో వన్‌సీఆర్‌, టూసీఆర్‌, త్రీసీఆర్‌, ఫోర్‌సీఆర్‌.. కేసీఆర్‌ అని గద్దర్‌ చెప్పిన మాట నిజమేనని అనిపిస్తోంది. కేసీఆర్‌అంటే అందరికీ అర్ధమైంది కదా. 15 రోజుల పాటుపూర్తిగా అధికార యంత్రాంగాన్ని మోహరించారు. మద్యం ఏరులై పారి, 200 కోట్ల వరకు ఖర్చు చేశారు. అక్కడ ఓటమితో నిరాశ చెందడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగుతుంది. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్‌ పార్టీనే." అని జైరామ్ రమేశ్ అన్నారు.

కొత్త ఉత్సాహం.. కొత్త శక్తితో కాంగ్రెస్ దూసుకు పోతుందని జైరామ్ రమేశ్ తెలిపారు. సాధారణ ఎన్నికలైతే స్రవంతి గెలిచేవారని అన్నారు. భారత్‌ జోడో యాత్రకు.. మునుగోడు ఉపఎన్నికకు సంబంధం లేదని చెప్పారు. తెలంగాణలో యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని వెల్లడించారు. తెలంగాణలో 8 జిల్లాల్లో 11 రోజుల పాటు 390 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సజావుగా కొనసాగిందని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చామని.. అతను వివరణ ఇస్తే ఏఐసీసీ చూసుకుంటుందని, ఇవ్వకపోతే తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేశారు. పార్టీకి క్రమశిక్షణ ముఖ్యమని.. గీత దాటితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.