ETV Bharat / state

ఈఎస్​ఐ కుంభకోణంలో మరొకరు అరెస్ట్

ఈఎస్​ఐ కుంభకోణంలో అనిశా అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటీవల బయటపడిన ఆడియో టేపు ఆధారంగా... కార్మిక రాజ్యబీమా సంస్థలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న సురేంద్రనాథ్​ బాబును అరెస్ట్ చేశారు.

ఈఎస్​ఐ కుంభకోణం
author img

By

Published : Sep 30, 2019, 7:46 PM IST

ఈఎస్ఐ కుంభకోణంలో అనిశా అధికారులు మరో ఉద్యోగిని అరెస్ట్ చేశారు. కార్మిక రాజ్యబీమా సంస్థలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న సురేంద్రనాథ్ బాబును అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పనిచేసే ఉద్యోగులకు ఫోన్ చేసి బిల్లులు రూపొందించాలని బెదిరించినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫోన్ సంభాషణల ఆడియోలు బయటికు వచ్చాయి.

ఉన్నతాధికారుల పాత్ర...

అవసరం లేకున్నా ఔషధాలు కొనుగోలు చేయడం, నిర్ణయించిన ధరకంటే ఎక్కువ డబ్బులు చెల్లించడం వల్ల ఇప్పటికే సుమారు 10కోట్లు అక్రమాలు జరిగినట్లు అనిశా తేల్చింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. సురేంద్రనాథ్ బాబు అక్రమాలకు పాల్పడినట్లు తేలడం వల్ల అతన్ని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరింత మందిని అనిశా అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదివరకు ఈఎస్ఐలో పనిచేసే పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న అనిశా... ఆ దిశగా ఆధారాలు సేకరిస్తోంది.

TG_HYD_37_30_ESI_SCAM_ARREST_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) ఈఎస్ఐ కుంభకోణంలో అనిశా అధికారులు మరో ఉద్యోగిని అరెస్ట్ చేశారు. కార్మిక రాజ్యబీమా సంస్థలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేంద్రనాథ్ బాబును అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పనిచేసే ఉద్యోగులను ఫోన్ చేసి బిల్లులు రూపొందించాలని బెదిరించినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫోన్ సంభాషణల ఆడియోలు బయటికి వచ్చాయి. అవసరం లేకున్నా ఔషధాలు కొనుగోలు చేయడం, నిర్ణయించిన ధరకంటే ఎక్కువ డబ్బులు చెల్లించడం వల్ల ఇప్పటికే సుమారు 10కోట్లు అక్రమాలు జరిగినట్లు అనిశా తేల్చింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. సురేంద్రనాథ్ బాబు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరింత మందిని అనిశా అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదివరకు ఈఎస్ఐలో పనిచేసే పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న అనిశా... ఆ దిశగా ఆధారాలు సేకరిస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.