ప్రస్తుత విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భారత మానసిక వైద్యుల సంఘం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ - ధీర్ఘకాలిక విధానాలపై ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్, భారత మానసిక వైద్యుల సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కేశవరావు పాల్గొన్నారు.
ఒత్తిడే కారణం
తమ పిల్లలు సమాజంలో మంచి స్థాయికి రావాలన్న కోణంలో తల్లిదండ్రులు ఒత్తిడి పెంచడం కూడా ఆత్మహత్యలకు కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలో కేవలం ర్యాంకుల కోసమే పాటు పడుతున్నారని... విద్యార్థులకు కనీసం క్రీడా మైదానం లేకుండా చేస్తున్నారని నిపుణులు వాపోయారు.
ప్రతీ పిల్లవాడిలోనూ ప్రతిభ ఉంటుందని... దానిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు.
ఇదీ చదవండి : ఆత్మహత్యలపై కొవ్వొత్తుల ప్రదర్శనలకు ఉత్తమ్ పిలుపు