రయ్ మంటూ బైక్ డ్రైవ్ చేస్తూ సెల్ఫీ తీస్తాడో కుర్రాడు.... స్నేహితురాళ్లతో అల్లరి చేస్తూ స్వియ చిత్రం దిగుతుందో చిన్నది. బస్టాండ్‌లో నిల్చున్నా, రోడ్ మీద వెళ్తున్నా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా సెల్ఫీ తీసుకోవటం ఇప్పటి యూత్ ఫ్యాషన్. నిద్ర లేవడంతోనే ఓ సెల్ఫీ , తింటున్నామని మరో సెల్ఫీ, డ్రెస్ ఎలా ఉందంటూ ఇంకో సెల్ఫీ తీసి తమ ఇన్స్టాగ్రామ్, వాట్సప్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఒకప్పుడు సరదాగా ప్రారంభమైన ఈ సెల్ఫీ ఇప్పుడు వ్యవసనంగా మారిందంటున్నారు నిపుణులు. గతంలో కొందరు రైలు పక్కన సెల్ఫీ దిగుతూ, నీళ్ల వద్ద సెల్ఫీ దిగుతూ ప్రాణాలనూ పోగొట్టుకున్నారు.
సెల్ఫీలతో చర్మసంబంధ వ్యాధులు తప్పవంటున్నారు నిపుణులు. తరచూ ఫోన్లో సెల్ఫీలు దిగటం వల్ల ఫోన్లోని బ్లూ లైట్ చర్మాన్ని పాడు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మొటిమలు, మచ్చల వంటి సమస్యలతోపాటు... పలు రకాల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు ఏకంగా సెల్ఫీ రిస్ట్ అనే వ్యాధి కూడా వస్తున్నట్టు గుర్తించారు. అంటే సెల్ఫీలు తరచూ తీసుకోవటం వల్ల మణికట్టు భాగం దెబ్బతినటాన్నే సెల్ఫీ రెస్ట్ అంటారు. వీటితోపాటు...సెల్ఫీలు సరిగా రాకపోయితే మానసిక రుగ్మతల భారిన పడుతున్న యువత అధికంగానే ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
అతి అనర్థదాయకం అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. సెల్ఫీ అప్పుడప్పుడు ముద్దు... ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ వద్దు అన్నది పెద్దల మాటే కాదు ... ఇప్పుడు వైద్యుల మాట కూడా. సెల్ఫీని సరదాగా ఎప్పుడైనా క్లిక్ చేసుకున్నంత వరకు ఫర్వాలేదు.. మరి శృతి మించింతే మీకే ప్రమాదం జాగ్రత్త సుమా.
ఇవీ చూడండి: ఒక తండ్రిగా ఆ బాధ నాకు తెలుసు: కేటీఆర్