"పొద్దున్నే లేవాలి.. హడావిడిగా రెడీ కావాలి.. ఆఫీస్ కు వెళ్లాలి.. రోబోలా పని చేయాలి.. తిరిగి ఇంటికి రావాలి.. పడుకోవాలి.. మళ్లీ సీన్ రిపీట్..!" ఏంట్రా ఈ తొక్కలో జీవితం అని బాధపడేవారి సంఖ్య.. నూటికి 90 వరకూ ఉంటుంది. కానీ.. ఇదే పని చేస్తున్న మిగిలిన 10 శాతం మంది మాత్రం హ్యాపీగా ఉంటారు..! 'మరి, ఇదెలా సాధ్యం..?" అంటే.. చాలా చిన్న లాజిక్. వీళ్లు చేస్తున్న పని.. వీళ్లకు నచ్చింది. కావాలని సెలక్ట్ చేసుకున్నది. కాబట్టి.. వీళ్లకు ఆఫీస్ అనేది ఒక ప్లే గ్రౌండ్! అలుపన్నదే లేకుండా ఆడేస్తుంటారు.
మిగిలిన వాళ్లకు మాత్రం.. వారు చేస్తున్న పని నచ్చట్లేదు. అవసరం కోసం మాత్రమే చేస్తున్నారు. అందుకే.. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా.. నిస్తేజంగా ఉంటారు. ఆఫీస్‌లో గడిపే 8 గంటల్లో.. గడియారం వైపు ఎన్నిసార్లు చూస్తారో వాళ్లకే తెలియదు. వారంలో 7 రోజులు వీక్లీ ఆఫ్ కోసం.. నెలలో 30 రోజులు జీతం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి జాబితాలో.. ఫ్లోరిడాలోని మయామికి చెందిన "మారియో సాల్సెడో" కూడా ఉన్నాడు. కానీ.. కంటిన్యూ కాలేదు. రిజైన్ లెటర్ విసిరి కొట్టాడు.. లైఫ్ డెస్టినేషన్ వైపు బయల్దేరాడు!
సుమారు పాతికేళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు. పలు ఫైనాన్స్ సంస్థల్లో పనిచేశాడు. ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ అనే సంస్థలో చాలా కాలం వర్క్ చేశాడు. నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నాడు. కొంత కాలం తర్వాత "ఏంట్రా ఈ జీవితం?" అనే ఆలోచన మొదలైంది. ఈ మొనాటినీ పనే దరిద్రం అనుకుంటే.. పక్కనే ఉంటూ గోతులు తవ్వే మనుషులు.. ముఖానికి ప్లాస్టిక్ నవ్వులు పూసుకొని తిరిగే జనాలు.. దీనికి అదనం! ఈ ఆలోచన తీవ్ర రూపం దాల్చి.. చివరకు 43 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని లెఫ్ట్ లెగ్ తో తన్నేశాడు!
అప్పటి వరకూ ఎన్నడూ విహార యాత్ర అనేదే తెలియని మారియో సాల్సెడో.. ఓ సారి సముద్రంపై విహరించాడు. ఎక్కడా లేనంత కిక్కు ఇచ్చింది. ఇది కదా జీవితం అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. 23 ఏళ్లుగా సముద్రంలోనే ఉంటున్నాడు! ఈ గ్యాప్‌లో.. కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే అతను భూమ్మీద ఉన్నాడు! అదికూడా.. కరోనా కారణంగా షిప్పులు తిరగడం కూడా ఆగిపోయిన నేపథ్యంలో.. అనివార్యంగా భూమిపై కాలు పెట్టాడు మారియో. మిగిలిన సందర్భాల్లో.. ఒకటీ రెండు రోజులు నేలపై ఉంటే చాలు.. "ఇది నా ప్రాంతం కాదు.. నేను ఇక్కడి వాడిని కాదు" అని అనిపిస్తుందట అతనికి!
అందుకే.. వెంటనే షిప్ ఎక్కేస్తాడు. అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ షిప్ లలో ప్రయాణిస్తూ.. దేశ విదేశాలను చుట్టేస్తుంటాడు మారియో. మనలో చాలా మందికి.. సముద్ర తీరాన్ని చూడడమే గొప్ప విషయం. ఇక, సముద్రంలో షిప్ లో ప్రయాణించడం అత్యంత అరుదు. ఒకవేళ ప్రయాణించినా.. ఒకటీ రెండు సార్లు మాత్రమే. కానీ.. మారియో మాత్రం 23 సంవత్సరాలుగా అప్రతిహతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ జీవితం తనకు ఎంతగానో నచ్చిందని అంటున్నాడు. 2023 ఏప్రిల్ వరకు క్రూయిజ్ షిప్ లను అతను బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకుంటూ పోతాడు!
అయితే.. ఎప్పుడూ ఒకే షిప్పులో వెళ్తే బోర్ కొట్టే ఛాన్స్ ఉన్నందున.. అవసరమైనప్పుడల్లా.. కొత్త షిప్ ను సెలక్ట్ చేసుకుంటాడు మారియో. ఆ విధంగా.. "అన్ స్టాపబుల్ జర్నీ" కంటిన్యూ చేస్తున్నాడు. "సముద్రంలో ఉండటం నాకు చాలా అలవాటైంది. భూమ్మీ ఉండటం కంటే.. నాకు ఇదే సౌకర్యంగా అనిపిస్తుంది" అని అంటాడు మారియో.
ఇదంతా సరేగానీ.. "క్రూయిజ్ షిప్లో ఒకసారి ప్రయాణించాలంటేనే భారీగా ఖర్చవుతుంది కదా.. అలాంటిది 23 ఏళ్లుగా వీటిల్లో ప్రయాణించాలంటే.. మాటలు కాదు. మరి, డబ్బు ఎలా?" అనే సందేహం రాక మానదు. దానికి ఆన్సర్ ఏమంటే.. క్రూయిజ్ లో రిలాక్స్ అవుతూనే పని చేస్తుంటాడు మారియో. ఆన్ లైన్ ద్వారా ప్రైవేట్ క్లయింట్స్‌కు సంబంధించిన పనులు చేసి పెడుతుంటాడు. ఆ వచ్చిన డబ్బుతో.. సముద్రంపై జాలీగా తిరిగేస్తుంటాడు.. ప్రపంచాన్ని చుట్టేస్తుంటాడు.. జీవితాన్ని అస్వాదిస్తుంటాడు.. అనుభవిస్తుంటాడు..!
ఎవ్వరికైనా.. జీవితం ఒక్కటే బాస్.. దానికి సప్లిమెంటరీలు లేవు. ఈ సారి సరిగా జీవించలేదు.. మరోసారి ట్రై చేస్తా అనడానికి లేదు. సో.. గాయ్స్! మీకు నచ్చిన మార్గం ఏంటో తెలుసుకోండి.. దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయండి.. ఆ మార్గం సరైనదే అని అనిపిస్తే చాలు.. ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోకండి.. ఆ దారిలో పయనిస్తూ ముందుకు సాగిపోండి. సక్సెస్ ను ఎంత ఇష్టంగా స్వీకరిస్తారో.. ఫెయిల్యూర్ ను కూడా అంతే ఆనందంగా తీసుకోండి.. కొంత కాలానికి అర్థమవుతుంది.. జీవితంలో సక్సెస్.. ఫెయిల్యూర్ అనేదే ఉండదని! ప్రతిదీ ఒక "ఎక్స్పీరియన్స్" మాత్రమేనని..!! అప్పుడు.. నిజమైన జీవితపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటారు అనుక్షణం.
పైన వేసిన ప్రశ్నకు సమాధానం ఇదే. జీవితానికి పరమార్థం ఇదే. "ఆనందం". మనం ఏం పని చేస్తున్నామన్నది కాదు. ఎక్కడున్నామన్నది కాదు.. ఎంత సంతోషంగా గడిపామన్నదే ముఖ్యం. మన బతుక్కి.. ఫైనల్ డెస్టినేషన్ హ్యాపీనెస్ మాత్రమే. జీవితాన్ని ఎంత ఆనందంగా ముగిస్తే.. అంత అద్భుతంగా బతికినట్టు లెక్క. మరి, మీ ఆనందం ఏంటో..? అదెక్కడుందో..? కనుక్కునే ప్రయత్నం మొదలు పెట్టండి.. ఇవాళ్టి నుంచే.. ఈ క్షణం నుంచే.. ఆల్ ది బెస్ట్.
వీటిపైనా ఓ క్లిక్కేయండి..
- "యమధర్మా.. వచ్చుచుంటిని.." ఫుల్లుగా తాగి నదిలో దూకేశాడు!
- వీళ్ల పెళ్లి జరుగుతుంది మళ్లీ.. మళ్లీ.. మూడేళ్లకోసారి విడాకులు!!
- టిక్ టాక్ కలిపింది ముగ్గురినీ..! భర్తకు లవర్ తో పెళ్లి చేసిన భార్య!
- పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. "మొగుడు" ఒక అమ్మాయి అని!
- "గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!
- "మిమ్మల్ని నా బంగారం అనుకున్నా.. ఛీ పోండ్రా.." రాజీనామా చేసిన యువతి..
- ఓ మంచి దేవుడా..! ఎందుకయ్యా గిట్ల చేసినవ్..?!
- అక్కడ వధూవరులను అమ్ముతున్నారు.. "మీలో ఎవరైనా షాపింగ్ చేస్తారా?"
- పోలీస్ స్టేషన్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. మేనేజర్ పోస్టు కావాలట!
- దొంగతనం చేశాను కదా.. నన్ను అరెస్టు చేయాల్సిందే!
- ఆయనకు ఇద్దరు కాదు.. 3.. 4.. 5.. 6.. 7.. 8.. 9.. 10.. 11.. ???
- వాటర్ తో అమ్మాయి "మ్యాజిక్".. 150 మంది ఖతం..!
- "నీ ఫోన్ నంబర్ లో 5 ఉందిగా.. నీకు జాబ్ లేదు పో!" (డేయ్.. ఎన్నడా ఇదీ..?)
- "ఛీ.. ఛీ.. ఏందిరా ఈ ఛండాలమూ..?" ఉద్యోగుల టాయిలెట్లో.. సీసీ కెమెరాలు!
- "ఎవరా నేరస్థుడు?" పోలీసుల వల్ల కాలేదు.. "దోమ" పట్టించింది!
- నిద్రలో భర్త కలవరింత.. వేడి వేడి నీళ్లు "అక్కడ" కుమ్మరించిన భార్య..!
- సూపర్ బ్రాండెడ్ షూస్.. వీటి ధర ఎంతో తెలుసా..?
- అర్జెంటుగా లావు తగ్గాలా..? వాళ్లు చిటికెలో పిండేస్తారు..!!