పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ (పీఈసీ) సమావేశమైంది. 17లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి 380 దరఖాస్తులు అందాయి. డీసీసీ నుంచి పీసీసీకి అందిన దరఖాస్తుల్లో వడపోసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.
మార్చిలో తుది జాబితా
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గెలుపునకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం పరిధిలోని డీసీసీ అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలతో పీసీసీ భేటీ కానుంది. పట్టభద్రుల స్థానానికి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుని పీసీసీకి అభ్యర్థుల ఎంపికపై తుది నివేదిక సమర్పిస్తుంది. ఏఐసీసీ అనుమతితో అభ్యర్థులను మార్చి మొదటి వారంలో పీసీసీ ప్రకటించనుంది.
ఇవీ చదవండి:ఇకపై స్పష్టంగా కారు