ETV Bharat / state

NTPC Second Level : ఎన్​టీపీసీ రెండోదశ పరీక్షకు ఏడు లక్ష్లల మంది అభ్యర్థుల ఎంపిక - ఎన్​టీపీసీ రెండోవ స్థాయి పరీక్షకు అభ్యర్థుల ఎంపిక

NTPC Second Level Examination: ఎన్​టీపీసీ రెండోదశ పరీక్షకు ఏడు లక్షల మంది అభ్యర్థులను దక్షిణ మధ్య రైల్వే ఎంపిక చేసింది. సీఈఎన్​ 2019లో 13.2వ పేరా ప్రకారం ఒక్కొక్క స్థాయిలో వారి ఆప్షన్ల ఎంపిక, విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.

NTPC Second Level Examination
ఎన్​టీపీసీ రెండోవ స్థాయి పరీక్ష
author img

By

Published : Jan 16, 2022, 2:10 PM IST

NTPC Second Level Examination: రెండోదశ సీబీటీ (Computer Based Test) కోసం ప్రతి ఆర్ఆర్​బీ (RRB NTPC) పరిధిలో ఆయా విభాగాల ప్రకారం ప్రకటించిన ఖాళీల ఆధారంగా ప్రతిస్థాయిలో 20 మంది చొప్పున ఎన్​టీపీసీ రెండోదశ పరీక్షకు ఎంపిక చేశారు. ఒకవేళ కటాఫ్ మార్కులలో సమానమైన మార్కులు పొందితే ఆ అభ్యర్థులందరినీ పిలుస్తారు. రెండో దశ సీబీటీలో వచ్చే మెరిట్ ఆధారంగా మూడో దశకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖాళీకి 8 మంది అభ్యర్థులను పిలుస్తారు. వీటిలో కొన్ని కేటగిరీలకు మూడో దశ వర్తించదు.

వారిని డిబార్ చేయలేరు..

నోటిఫికేషన్ ప్రకటనలోని 35,281 ఖాళీలకు సంబంధించి ఏ అభ్యర్థినీ ఒక పోస్టుకు మించి ఎక్కువ పోస్టుల్లో ఎంపిక చేయడం జరగదు. ఉన్నతస్థాయి పోస్టుకు ఎంపిక చేసిన అభ్యర్థిని.. దిగివ స్థాయి పోస్టు రెండో దశ సీబీటీ ఎంపికకు సంబంధించి డిబార్ చేయడం జరగదు. గతంలో ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఈసారి రెండోదశకు ఒక్కో పోస్టుకు 20 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఇదీ చూడండి: 'భారత్​ అగ్రగామిగా ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకం '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.