ETV Bharat / state

ఉమెన్స్ సేఫ్టీ​ వింగ్​

మహిళా భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మహిళా దినోత్సవం నాడు ఉమెన్స్​ సేఫ్టీ వింగ్​ను ప్రారంభించింది. ఇది షీ టీమ్స్​, భరోసా సెంటర్లకు అనుబంధంగా పని చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో తెరాస ఎంపీ కవిత పాల్గొన్నారు.

ఉమెన్స్​ సేఫ్టీ​ వింగ్​ కార్యాలయం
author img

By

Published : Mar 8, 2019, 2:43 PM IST

ఉమెన్స్ సేఫ్టీ​ వింగ్​
హైదరాబాద్​ లక్డీకపూల్​లో మహిళా భద్రత విభాగం నూతన భవనాన్ని హోంమంత్రి మహమూద్​ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్​ ఎంపీ కవిత, డీజీపీ మహేందర్​ రెడ్డి, సీపీ అంజనీ కుమార్,​ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఉమెన్స్​ సేఫ్టీ వింగ్​ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని స్వాతి లక్రా అన్నారు. మహిళా భద్రత కోసం ఇంతకు ముందే షీ టీమ్స్​, భరోసా సెంటర్లను తీసుకొచ్చామని తెలిపారు.

అప్రమత్తంగా ఉన్న మహిళలపై దాడులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మహిళల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్​ ఎంపీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. ​ ఎంత అప్రమత్తంగా ఉన్నా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మాది ఫ్రెండ్లీ పోలీసింగ్
మహిళా భద్రత కోసం కేసీఆర్​ కృషి చేస్తున్నారని హోం మంత్రి మహమూద్​ అలీ అన్నారు. స్నేహపూర్వక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. స్వాతి లక్రా మహిళల్లో ధైర్యాన్ని నింపారని పేర్కొన్నారు.

మహిళా భద్రత విభాగం షీ టీమ్స్​, భరోసా విభాగాలకు అనుంబంధంగా పని చేయనున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఉమెన్స్​ సేఫ్టీ వింగ్​ ఏర్పాటు పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:ఆకాశమంతా మాదే!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.