ETV Bharat / state

ఎన్నికల వేళ భాగ్యనగర భద్రతకు పోలీసుల పటిష్ఠ నిఘా - telangana police department

Security in Hyderabad For Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలవేళ పార్టీల మధ్య వాగ్వాదాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓట్లు పడాలంటే ప్రత్యర్థిపై అన్ని విధాలుగా తమదే పైచేయి అన్నట్టుగా పరిస్థితులను మార్చుతున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తుండగా.. తాజాగా చార్మినార్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

Police Alert in Old City Hyderabad
Security in Hyderabad For Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 8:51 AM IST

భాగ్యనగర భద్రతకు ఎన్నికల వేళ పోలీసుల పటిష్ఠ నిఘా

Security in Hyderabad For Assembly Elections 2023 : గ్రేటర్‌ పరిధిలోని పలు చోట్ల ప్రత్యర్థి పార్టీలు తమ అడ్డాలోకి కాలుపెడితే సహించబోమంటూ.. పార్టీ కార్యకర్తలు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు కావటంతో పోలీసులు(Telangana Police) సైతం ఆచీతూచి స్పందిస్తున్నారు. ముందుగా ఇరువర్గాలకు నచ్చజెబుతూ.. మాట వినని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను(TS Elections 2023) ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు ఎంతకైనా సిద్ధపడుతున్నాయి. అభ్యర్ధులు ఖరారుకావటం, నామినేషన్ల పర్వంతో ప్రచారం క్రమంగా వేడెక్కుతున్న క్రమంలో.. తమ ఇలాఖాలో ఆధిపత్యం చాటుకునేందుకు భారీ ప్రదర్శనలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఒకే మార్గంలో ర్యాలీలు, ప్రచారాలకు ఆస్కారం లేకుండా పోలీసులు అనుమతులిస్తున్నా... కొన్నిచోట్ల రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న తీరే సమస్యలకు కారణమవుతోంది.

Telangana Assembly Election Polling Arrangements : ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల చర్యలు

Police Alert in Old City Hyderabad : రౌడీషీటర్లు, అసాంఘికశక్తులను బైండోవర్‌ చేసినా.. అనుచరులను రంగంలోకి దింపి మరీ హల్‌చల్‌ చేస్తున్నారు. పోలీసుల కళ్లెదుటే బహిరంగ దాడులకి పాల్పడుతున్నారు. మలక్‌పేట్‌, లంగర్‌హౌజ్‌,చార్మినార్‌ ప్రాంతాల్లో వరుస ఘటనలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగానే.. పోలింగ్‌కు ముందుగానే అదనపు బలగాలను రప్పిస్తున్నారు. దక్షిణ, పశ్చిమ, సౌత్‌ఈస్ట్, సౌత్‌వెస్ట్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుగా మారింది. అలాంటి ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో అధికశాతం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు దక్షిణ, పశ్చిమ మండలాల్లోనే ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందు నుంచే పోలీస్‌స్టేషన్ల వారీగా సున్నితమైన ప్రాంతాల జాబితా సిద్ధం చేశారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రజాజీవనానికి విఘాతం కలిగించే.. అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించమని నగర సీపీ సందీప్‌శాండిల్య ఆదేశించారు.

ప్రచారంలో పరస్పరం రెచ్చగొట్టుకునేలా నినాదాలు చేసేవారిని పసిగట్టాలని స్పష్టంచేశారు. అభ్యరుల ప్రచారంలో భద్రతకు బందోబస్తు పెంచాలని సూచించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు ఏసీపీలు, కొందరు ఇన్‌స్పెక్టర్లను సున్నితంగా మందలించినట్టు సమాచారం. ప్రస్తుతం సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఒక్కో నియోజకవర్గానికి 100 మంది అదనపు బలగాలను రంగంలోకి దింపనున్నారు.

Police Implement Election Code in Telangana : రసీదు ఉంటేనే రక్షణ! ఎన్నికల కోడ్​ వేళ తనిఖీలతో జాగ్రత్త.. ఈ పత్రాలు మర్చిపోకండి

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.