ETV Bharat / state

'వారి చిరునవ్వును మంత్రి కేటీఆర్​కు కానుకగా ఇచ్చాం' - groceries distribution on the eve of ktr birth day

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి విషయంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని సికింద్రాబాద్​ తెరాస నేతలు అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్​ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్​లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

groceries distribution in secundrabad
సికింద్రాబాద్​లో నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Jul 24, 2020, 12:49 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సికింద్రాబాద్ తెరాస నేతలు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసరాలు అందజేశారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

మంత్రి కేటీఆర్​కు శుభాకాంక్షలు తెలియజేసి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి తోచినంత సాయం చేసి వారి చిరునవ్వును కానుకగా ఇవ్వాలన్న కేటీఆర్ కోరిక మేరకు పేదలకు నిత్యావసరాలు అందజేసినట్లు తెరాస నేతలు తెలిపారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.