హైదరాబాద్ ఆర్చ్ డైయాసిస్ ఎడ్యుకేషల్ సొసైటీ బిషప్ తుమ్మబాల చర్చి ఫాదర్లు కలసి సికింద్రాబాద్లోని సెయింట్ మేరిస్ చర్చిలో నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్కు తొమ్మిది వేల శానిటైజర్లను, పది వేల గ్లౌజులను అందజేశారు. పోలీసుల ఆరోగ్య రక్షణార్థం వీటిని అందించారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. వారి రక్షణ కోసం తమ వంతు బాధ్యతగా శానిటైజర్లు, గ్లౌజులు అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లాక్డౌన్ను ప్రజలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమై పోలీసులకు సహకరించాలని నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ కోరారు. నార్త్ జోన్ సిటీ పోలీసులకు శానిటైజర్లు.. గ్లౌజులను అందించిన బిషప్నకు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: ఆ 2 విషయాల వల్లే అమెరికాలో కరోనా చిచ్చు!