Secunderabad Alpha Hotel Seized at Hyderabad : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో.. హైదరాబాద్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఇరానీ చాయ్, పసందైన బిర్యానీ. అలాగే సికింద్రాబాద్ అనగానే మైండ్‌లో ఫ్లాష్ అయ్యే పేరు అల్ఫా హోటల్. ఎందుకంటే అక్కడ దొరికే వివిధ రకాల ఆహార పదార్థాలు. దీనికి తోడూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో ఇది చాలా ఫేమస్ అయింది. ఎప్పుడు చూసిన కస్టమర్లతో బిజీబిజీగా ఉంటుంది. మరోవైపు సరసమైన ధరలకే ఫుడ్ లభించడంతో వినియోగదారులు ఈ హోటల్‌కు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ కస్టమర్లతో బిజీబిజీగా ఉండే అల్ఫా హోటల్ తాజాగా మూత పడింది. ఎందుకో తెలుసా..?
Secunderabad Alpha Hotel Closed : నగర ప్రజలు, యువత ఎక్కువగా వెళ్లే సికింద్రాబాద్ అల్ఫా హోటల్ సరసమైన ధరలు.. రకరకాల పసందైన ఫుడ్‌కు పేరు గాంచింది. కానీ అదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు.. అపరిశుభ్ర వాతావరణం. నాణ్యతలేని ఆహారం. అందుకే ఈ హోటల్ ఇప్పుడు మూతపడింది. నాణ్యత లేని పదార్థాలను అపరిశుభ్ర వాతావరణంలో వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలోని అల్ఫా హోటల్‌ను (Alpha Hotel) జీహెచ్ఎంసీ అధికారులు మూసివేశారు. యజమానిపై పెనాల్టీ విధిస్తామని తెలిపారు.
Food Adulteration at Secunderabad Alpha Hotel : ఈనెల 15న ఆ హోటల్ తిన్న తర్వాత వినియోగదారుడు అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఫిర్యాదు చేశాడు. అదే విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో బల్దియా అధికారులు హోటల్‌ను పరిశీలించారు. వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించకపోవడం, యాజమాన్యం నిర్లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officials)తనిఖీల్లో గుర్తించారు.
మీరు తాగేవి స్వచ్ఛమైన పాలేనా.. ఇలాంటి 'కల్తీ'గాళ్లు ఉంటారు జాగ్రత్త..!
అలాగే సేకరించిన ఫుడ్ శాంపిల్స్‌ను నాచారంలోని స్టేట్‌ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ క్రమంలోనే మరోసారి అధికారులు హోటల్‌ను తనిఖీ చేశారు. ఈసారి కూడా యాజమాన్యం తగు చర్యలు తీసుకోకపోవడంతో హోటల్‌ను మూసివేసి.. తగిన పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి హోటల్ యాజమాన్యానికి పెనాల్టీ విధిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
మరోవైపు సమాజంలో అక్రమ కల్తీ వ్యాపారాలు అధికమయ్యాయి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు.. ఆహార పదార్థాలన్నింటిని (Food Adulteration) కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు కల్తీ రాయుళ్లు. ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ... ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అపరిశుభ్ర వాతావరణం, కల్తీ పదార్థాలతో కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.
పసివాళ్లకు పట్టే పాల నుంచి నీళ్లు, పండ్లు, కూరగాయలు, తేనే, వంట నూనె సహా... లెక్కలేనన్ని పదార్థాలు ఇందులో ఉన్నాయి. పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా.. విక్రయిస్తున్న ప్రజలను ఈ వార్తలు కంగారు పెట్టిస్తున్నాయి. కల్తీ పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో తక్షణం ఎటువంటి చెడు ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంలో మాత్రం అనారోగ్యం పాలవుతున్నారు.
మీరు తాగేవి స్వచ్ఛమైన పాలేనా.. ఇలాంటి 'కల్తీ'గాళ్లు ఉంటారు జాగ్రత్త..!