Secunderabad Agnipath case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న 45మంది నిందితులను రైల్వే పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు, రేపు వారిని పలుకోణాల్లో ప్రశ్నించనున్నారు. ఘటనకు సంబంధించిన పలు అంశాలపై వారి నుంచి సమాచారం రాబట్టనున్నారు. రేపు సాయంత్రం 5గంటల వరకు పోలీసుల విచారణ కొనసాగనుంది. తిరిగి వారిని వైద్యపరీక్షల అనంతరం రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
అసలేం జరిగిందంటే.. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసం చెలరేగింది. ఒక్కసారిగా దూసుకువచ్చిన వేలమంది ఆర్మీ ఆశావహులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 8 రైళ్లకు చెందిన బోగీలను తగులబెట్టారు. షాపులను లూటీ చేశారు. ఆర్టీసీ బస్సులపైనా దాడిచేశారు. పక్కా పథకం ప్రకారం జరిగిన ఆ దమనకాండను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. పలువురికి బుల్లెట్లు తాకి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: ఇక్కడ సర్కారు కూలిస్తే.. అక్కడ వారిని గద్దె దింపుతాం: కేసీఆర్
నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. కెమిస్ట్ దారుణ హత్య.. ఉదయ్‌పుర్ తరహాలోనే!