సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ లెక్కింపు కేంద్రాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. లెక్కింపు కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
బందోబస్తు కోసం సుమారు 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. మౌంటెడ్ గుర్రాలు, పెట్రోలింగ్ వాహనాలు, సీసీటీవీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు రోజున ఇండోర్ స్టేడియం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 5 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం హామీ ఇచ్చింది.. విచారణ అవసరం లేదు: హైకోర్టు