సచివాలయ టెండర్ల దాఖలు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. అక్టోబర్ ఒకటో తేదీతో ముగియనున్న గడువును 13వ తేదీ వరకు పొడిగించింది. 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు టెండర్లు స్వీకరిస్తారు. 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి రహదార్లు-భవనాల శాఖ ఇప్పటికే టెండర్ పిలిచింది. టెండర్ దాఖలు గడువు పొడిగింపు నేపథ్యంలో ఇవాళ జరగాలైన ప్రీబిడ్ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ప్రీబిడ్ సమావేశం వచ్చే నెల ఏడో తేదీన జరగనుంది. సాంకేతిక బిడ్లను వచ్చే నెల 13వ తేదీన, ఆర్థిక బిడ్లను వచ్చే నెల 16వ తేదీన తెరుస్తారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి