తాత్కాలిక సచివాలయమైన బీఆర్కే భవన్‌కు దస్త్రాల తరలింపు వేగవంతమైంది. ఇవాళ ఏ బ్లాక్‌లోని అధికారుల దస్త్రాలు బీఆర్కే భవన్‌కు తరలిస్తున్నారు.మంగళవారం వరకు ఈ బ్లాక్ పనులు పూర్తి కానున్నాయి.
బీఆర్కే భవన్‌కు కార్యాలయాలు తరలించినప్పటికీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సచివాలయం కోసం వినియోగిస్తున్న సర్వర్లు, నెట్‌వర్క్ వ్యవస్థను అక్కడే నెలకొల్పేందుకు చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఇంటర్నెట్, ఇంట్రానెట్ సదుపాయంతో అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : జూరాలకు పోటెత్తుతోన్న వరద