లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోయిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అమరావతి బయల్దేరారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతితో ప్రత్యేక బస్సుల్లో వారిని తీసుకొచ్చారు. లాక్‌డౌన్ వల్ల హైదరాబాద్‌లో చిక్కుకున్న సచివాలయ ఉద్యోగులను రాష్ట్రానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు.
400 మందికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని సీఎస్ లేఖలో కోరారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మియాపూర్, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్ నుంచి 10 ఆర్టీసీ బస్సుల్లో సచివాలయ ఉద్యోగులు అమరావతి తరలి వస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'