గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో భారీ అగ్నప్రమాదం జరిగింది. గత పదిరోజుల్లో వర్సిటీ అటవీప్రాంతంలో రెండోసారి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అర్ధరాత్రి చెలరేగడం వల్ల పది ఎకరాలకు పైగా అటవీప్రాంతం అగ్నికి ఆహుతయ్యింది.
స్థానికుల సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు. వర్సిటీ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జరిగిన ప్రమాదంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. బయటి వ్యక్తులు వర్సిటీ ప్రాంగణంలోకి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'